మహేష్ నెక్ట్స్ గీతా ఆర్ట్స్ లో ఫైనల్, డైరక్టర్ ఎవరంటే…

                                                    (సూర్యం)

అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే ఆ క్రేజే వేరు. చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన గీతా ఆర్ట్స్ ఈ మధ్యన గీతా ఆర్ట్స్ 2 అని పెట్టి గీతా గోవిందం లాంటి సూపర్ హిట్స్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు హీరోగా సినిమా కు సై అంది. సాధారణంగా గీతా ఆర్ట్స్ లో పెద్ద హీరో సినిమా అంటే రామ్ చరణ్, చిరంజీవి, అల్లు అర్జున్ వీళ్ల పేర్లే వినపడతాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చి మహేష్ తో మొదలెడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు డైరక్టర్ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరెవరో కాదు..సందీప్ వంగా.

అవును ..అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన సందీప్ వంగా తన తదుపరి చిత్రాన్ని మహేష్ తోనే ప్లాన్ చేస్తున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు ఆ న్యూస్ నిజమే అని తేలింది. రీసెంట్ గా సందీప్ వంగా చెప్పిన లైన్ విన్న మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా కాలంగా అల్లు అరవింద్ తో సినిమా చేయాలని మహేష్ అనుకుంటున్నారు. దాంతో సందీప్ ని అక్కడికి పంపి అడ్వాన్స్ ఇప్పించి సైన్ చేయించినట్లు సమాచారం.

బడ్జెట్ ఎంతైనా ఫరావాలేదు కానీ ఖచ్చితంగా అర్జున్ రెడ్డి ని మించిన సూపర్ హిట్ ఇవ్వాలనే కండీషన్ తో అల్లు అరవింద్ ఓకే చేసారని చెప్తున్నారు. ఏదైమైనా అల్లు అరవింద్ సినిమా అంటేనే మినిమం గ్యారెంటీ. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని రాసేసుకోవచ్చు..ఏమంటారు?