సైఫ్‌- క‌రీనాతో కింగ్-ర‌కుల్ జంట‌ పోలికా!

కింగ్ నాగార్జున‌- ర‌కుల్ ప్రీత్ జంట‌గా న‌టించిన మ‌న్మ‌ధుడు 2 ఈ శుక్ర‌వారం (ఆగ‌స్టు9) రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ లో రొమాన్స్ హ‌ద్దు మీరింద‌ని, నాగ్ – ర‌కుల్ జంట మ‌ధ్య ఏజ్ గ్యాప్ స్ప‌ష్టంగా తెలిసిపోతోంద‌ని నెటిజ‌నులు కామెంట్ చేశారు. అయితే ఇది ఏజ్ గ్యాప్ రొమాంటిక్ కామెడీ అంటూ ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్, నాగార్జున క్లారిటీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే మ‌రీ ఇంత ఏజ్ గ్యాప్ తో ఈ రోజుల్లో రొమాన్స్ బ‌య‌ట సాగుతోందా? అంటూ ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ని అడిగేస్తే ఆయ‌నేమ‌ని క‌వ‌ర్ చేశారో తెలుసా? తెర‌పైనే కాదు బ‌యటే ఇలా ఎక్కువ‌గా ఉంది. మీరు చూడ‌లేదా? అని ప్ర‌శ్నించారు. బాలీవుడ్ జంట‌ సైఫ్‌- క‌రీనా(సైఫీనా)తో కింగ్-ర‌కుల్ జంటను పోల్చి చెప్పారు.

అయినా ఏజ్ గ్యాప్ రొమాన్స్ నేప‌థ్యంలో చాలా సినిమాలొచ్చాయి. హిందీలో చినీక‌మ్ ఎప్పుడో వ‌చ్చింది. ర‌కులే చేసిన `దేదే ప్యార్ దే` ఇదే త‌ర‌హా క‌దా? . ఇదీ కంటెంప‌ర‌రీనే. ఏజ్ గ్యాప్ అనేది బ‌య‌ట స‌మాజంలో చాలా ఎక్కువ సుమీ! అంటూ వివ‌ర‌ణ ఇచ్చారు ద‌ర్శ‌కుడు రాహుల్. ఇక ఈ సినిమాని ఆడియోన్ ముందు డీగ్రేడ్ చేయ‌డానికి తీయ‌లేదు. ఎంతో క్యూట్ గా ఫ‌న్నీగా తీశాం. ఎక్క‌డా జూమింగ్ చేసి టిక్కెట్ అమ్మాల‌ని ఒక్క షాట్ కూడా తీయ‌లేదు అని తెలిపారు.

మేం డైలాగ్స్ రాసిన‌ప్పుడు సింగిల్ మీనింగ్ అనుకుని రాశాం. క్యూట్ గా నాటీగా చీకీగా ఉండాల‌నుకునే రాశాం. అలాగ‌ని వ‌ల్గ‌ర్ గా ఎక్క‌డా ఉండ‌దు. అంద‌రూ కూచుని చూస్తే నాటీగా అనిపిస్తుంది. అది కూడా కొన్ని డైలాగులు మాత్ర‌మే అలా అనిపిస్తాయి. ఒక డైలాగ్ కి డ‌బుల్ మీనింగ్ అంటూ నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. క్రికెట్ కోచ్ గా ఉండాల్సిన వ‌య‌సులో ఈయ‌న బ్యాటింగేంటి? అని డైలాగ్ రాశాం .. అది సింగిల్ మీనింగ్ అనుకుని రాశాం. కానీ టీజ‌ర్ వ‌చ్చాక అలా అర్థం చేసుకుంటార‌ని ఊహించ‌లేదు. టీజ‌ర్ బ‌య‌టికి వ‌చ్చాకే తెలిసింది.. అని రాహుల్ అన్నారు. మొత్తానికి డ‌బుల్ మీనింగ్ డైలాగుల్ని బాగానే క‌వ‌ర్ చేశారు యంగ్ డైరెక్ట‌ర్. మామూలుగా అనుకుని రాసిన‌వే అంత ఘాటుగా ఉన్నాయంటే.. కావాల‌ని అనుకుని రాస్తే ఇంకెంత ఘాటుగా పేలేవో కదూ?