మెగా క్యాంపులో చేరిన మహేష్ బాబు హీరోయిన్

బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థి మీద పంచులు విసరడానికి వరుణ్‌ తేజ్‌ సిద్ధమవుతున్నారు. మరి లైఫ్‌లో ప్రేమను చూపించడానికి హీరోయిన్‌ కూడా కావాలి కదా… ఆ హీరోయిన్‌ దొరికేసిందట.

ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా కియారా అద్వానీ పేరుని పరిశీలిస్తున్నారట .వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుంది. వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపిస్తారు. బాక్సర్‌కు జోడీగా కియారా అద్వానీ కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాను అల్లు వెంకటేశ్, సిద్ధు నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.

‘కబీర్‌ సింగ్‌’తో భారీ విజయాన్ని అందుకున్న కైరా అద్వానీ ప్రస్తుతం ఐదారు  ప్రాజెక్టుల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఓ వైపు ముంబయిలో జరుగుతున్న ‘గుడ్‌ న్యూస్‌’ షూటింగ్‌లో, మరోవైపు లక్నోలో జరుగుతున్న ‘ఇందూ కి జవానీ’ చిత్రీకరణలో పాల్గొంటోంది. మధ్యలో వచ్చే గ్యాప్‌లో ‘లక్ష్మిబాంబ్‌’, ‘షేర్షా’, ‘భూల్‌ భులైయ్యా 2’ చిత్రాల్లో నటిస్తూ బిజీయెస్ట్‌ క్రేజీ హీరోయిన్‌గా కైరా తన డిమాండ్ ని ఎంజాయ్ చేస్తోంది.