మహేష్ సూపర్ హిట్ చిత్రం భరత్ అను నేను సినిమాలో హీరోయిన్ గా చేసిన కియారా అద్వానీ గుర్తుందా అని అడగటం పిచ్చి ప్రశ్న. ఎందుకంటే ఆమెను మర్చిపోవటం చాలా కష్టం అంటారు కుర్రాకారు. యస్..నిజమే ఆమె యూత్ లోకి అంతలా దూసుకుపోయింది. ఆ విషయం అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా కూడా గమనించినట్లు ఉన్నారు. ఆయన కూడా ఆమె నటనతో ప్రేమలో పడినట్లు ఉన్నారు. అందుకే తన అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కు ఆమెను హీరోయిన్ గా ఎంచుకున్నారు.
మొదట వేరే అమ్మాయి ని అంటే మోడల్ తారా సుతారియాని తీసుకుందామనుకున్నారట. కానీ కరణ్ జోహార్..అబ్బే ఆమె మా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 షూటింగ్ లో బిజీగా ఉంది..మీరు వేరే వాళ్లను వెతుక్కోండి ఎగ్రిమెంట్ చూపెట్టి మరీ బెదరకొట్టేసాడట. దాంతో అంత పెద్ద ప్రొడ్యూసర్ అంత గౌరవంగా చెప్పాక…వేరే వాళ్లతో ముందుకు వెళ్దామని సెర్చింగ్ మొదలెడితే షాహిద్ కపూర్ ఓ రోజు ఆమె వీడియో చూపి..ఈమె ఎలా ఉంటుంది అని అడిగాడట.
అరే ఆమె మా తెలుగు సినిమాలో చేసిన కియారా అద్వాని కదా అని అనేసాడట. ఆమె లస్ట్ స్టోరీస్ వెబ్ సీరిస్ తో టాప్ రేంజికి వెళ్లిపోయింది తెలుసా అన్నాడు షాహిద్. ఓకే ఇంకేం ఆమెతోనే ముందుకు వెళ్దాం అన్నాడు డైరక్టర్. ఆ రకంగా వాళ్ళిద్దరూ ఆమెను ఓకే చేసి ప్రపోజల్ పెట్టడం జరిగింది.