సాహో వర్సెస్ సైరా .. హిందీలో ఎవరు?
`బాహుబలి` తర్వాత కన్నడ చిత్రం `కేజీఎఫ్` మార్కెటింగ్ స్ట్రాటజీ ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఆ సినిమాకి తెలుగు రిలీజ్ విషయంలో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో సాయం చేశారు. హిందీ మార్కెట్ విషయంలోనూ అతడి సాయం ఉందని చెప్పుకున్నారు. కేజీఎఫ్ చిత్రాన్ని తెలుగులో వారాహి చిలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు. హిందీలో అనీల్ తడానీ, ఫర్హాన్ అక్తర్ బృందం సంయుక్తంగా రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే టీమ్ `సైరా` చిత్రాన్ని బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ఆ ఇరువురితో ఒప్పందం చేసుకుంది.
ఈ బుధవారం నుంచి సైరా: నరసింహారెడ్డి
అసలు ప్రమోషన్స్ ప్రారంభం అవుతున్నాయి. తొలిగా సైరా మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తోంది చిత్రబృందం. బుధవారం మధ్యాహ్నం 3.45 పీఎం మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తున్నారు. అటుపై రెగ్యులర్ గా ఏదో ఒక పోస్టర్ లేదీ టీజర్ లేదా వీడియోతో నిరంతరం ప్రచారం హోరెత్తించనున్నారట. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని సైరా చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు అన్ని రకాలుగా చరణ్ – సురేందర్ రెడ్డి బృందం అహోరాత్రులు శ్రమిస్తున్నారు. సైరా వీఎఫ్ఎక్స్ కోసం ఒకేసారి 26 స్టూడియోల్లో పని నడుస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెటింగ్ పరంగానూ కొత్త స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. బాహుబలి చిత్రాన్ని కరణ్ జోహార్ రిలీజ్ చేస్తే, కేజీఎఫ్ చిత్రాన్ని ఫర్హాన్- అనీల్ తడానీ బృందం రిలీజ్ చేశారు. వీళ్లే ఇప్పుడు సైరాను హిందీలో రిలీజ్ చేస్తున్నారు. సాహో హిందీ వెర్షన్ ని ప్రఖ్యాత టీ-సిరీస్ సంస్థ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.