ఇండస్ట్రీ టాక్ : నిర్మాతగా మారబోతున్న “కేజీఎఫ్” దర్శకుడు..ఏ భాషలో అంటే?

Prashanth Neel pin hopes on July 16th

తాను తీసింది జస్ట్ మూడే మూడు సినిమాలు అయినా కూడా ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని నమోదు చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. మన తెలుగు మూలాలకి చెందిన వాడే అయినా కన్నడలో స్థిరపడ్డారు.

దీనితో వారి ఇండస్ట్రీ నుంచి తీసిన భారీ చిత్రం కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు భారీ లెవెల్లో రెస్పాన్స్ ని కొల్లగొట్టాయి. ఇక ఈ చిత్రాలు తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “సలార్”, ఎన్టీఆర్ తో మరో సినిమా చేస్తుండడంతో ఎనలేని హైప్ ని తాను సెట్ చేసుకోగా తన నుంచి ఇంకా ఎలాంటి సినిమాలు వస్తాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా..

ఇపుడు ఈ దర్శకుడు అయితే నిర్మాతగా మారబోతున్నట్టుగా ఇండస్ట్రీ నుంచి భోగట్టా. మరి నీల్ కూడా ఈసారి తెలుగులో ఓ సినిమాని నిర్మాణం వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే దీనికి దర్శకుడు కూడా లాక్ అయ్యాడని అంటున్నారు.

మరి ఆ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అనే డీటెయిల్స్ ఇంకా బయటకి రావాల్సి ఉన్నాయట. గతంలో అయితే ఓ చిన్న సినిమాని ప్రశాంత్ నీల్ నాచురల్ స్టార్ నానితో చేస్తాడని టాక్ వచ్చింది. మరి ఆ సినిమా ఇదేనా కాదా అనేది తెలియాల్సి ఉంది.