షాకింగ్ : “కేజీఎఫ్ 2” కి తెలుగులో డిజాస్టర్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది.!

KGF Chapter 3

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర రెండు భారీ హిట్ లు జస్ట్ ఒక్కో నెల వ్యవధిలోనే తగిలాయి. అయితే అందులో ఒకటి మన తెలుగు నుంచి RRR కాగా మరొకటి కేజీఎఫ్ చాప్టర్ 2 కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ..

ఈ సినిమా హిందీలో RRR కన్నా బెటర్ వసూళ్లు రావడంతో దానికన్నా ఇదే అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా రికార్డు సెట్ చేసింది. కానీ ఇంకా మరే విషయంలో కూడా RRR తో పోటీ పడలేకపోయింది అని ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అయ్యింది.

గత కొన్నాళ్ల కితమే ఈ సినిమా తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ కి రాగా ఈ సినిమాకి కేవలం అంటే కేవలం 9.15 రేటింగ్ మాత్రమే వచ్చింది అట. ఈ సినిమాకి మన తెలుగులోనే 100 కోట్లకి పైగా వసూళ్లు వచ్చి భారీ హిట్ అయ్యింది.

అలాంటిది టెలివిజన్ పై మాత్రం రేటింగ్ కనీసం 10 కూడా దాటకపోవడం అనేది షాకింగ్ అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో యష్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి అయితే హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా ప్రకాష్ రాజ్, సంజయ్ దత్ రావు రమేష్ అలాగే రవీనా టాండన్ లు కీలక పాత్రల్లో నటించారు.