అల్లు అర్జున్ సరసన ఈ సెక్సీ బేబి సెట్ అవుద్దా

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో … పూజా హెగ్డే హీరోయిన్. అయితే ఈ చిత్రంలో మరో హీరోయిన్ కీ స్థానం ఉందని తెలుస్తోంది. నివేదా థామస్‌ ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేస్తోందని వార్తలొస్తున్నాయి.

అలాగే కీతికా శర్మ అనే కొత్తమ్మాయి ఈ సినిమాలో నటిస్తోంది. డిల్లీ బేసెడ్ మోడల్ అయిన ఆమె పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి కొత్త చిత్రం రొమాంటిక్ లో చేస్తోంది. అయితే చిత్ర యూనిట్ రెండో హీరోయిన్ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.

కొద్ది పాటి గ్యాప్ తర్వాత కొత్త షెడ్యూలు తిరిగి ప్రారంభం కానుంది. ఈనెలాఖరు నుంచి హైదరాబాద్‌లోనే షూటింగ్ మొదలెడతారని తెలుస్తోంది. ఈ షెడ్యూలులోనే దాదాపు షూటింగ్ పూర్తి చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ‘నాన్న నేను’, ‘అలకనంద’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.