కౌశల్ హీరోగా సినిమా..స్పెషాలిటీ ఏంటంటే

తాను ఎలాంటి అంచనాలు లేకుండా సామాన్యుడులా హౌస్‌లోకి వెళ్లి ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 2 విజేతగా నిలిచారు  కౌశల్. కౌశల్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాల్లో ఆఫర్స్ సైతం వస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ సినిమాలో కీ రోల్ కు ఎంపికయ్యాడని సమాచారం.   ఇప్పుడు ఏకంగా సినిమా హీరోగా మారబోతున్నాడని తెలుస్తోంది. కౌశల్ ఆర్మీ గ్రూపుల అన్ని కలిసి కౌశల్ ని హీరోగా పెట్టి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. గతంలో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన కౌశల్, ప్రస్తుతం సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు.

ఈ  బిగ్ బాస్ హంగామాతో  అని హీరోగా అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా స్పెషాలిటి ఏమిటంటే… కౌశల్ ఆర్మీ గ్రూపుల అన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా నాలుగు కోట్ల బడ్జెట్ తో సినిమా చేయబోతున్నారట. మరి ఈ సినిమాతో కౌశల్ సినిమాల్లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటాడని అంటున్నారు.  ఇక కౌశల్ మాట్లాడుతూ.. ఓ టాస్క్‌లో భాగంగా తోటి హౌస్‌మేట్ కిరిటీ తన కళ్లలో నిమ్మకాయ పిండాడని, అప్పటి నుంచే తన అసలైన గేమ్ స్టార్టయ్యిందని వెల్లడించాడు. 

బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కౌశల్ ఇంటి వద్ద కౌశల్ ఆర్మీ నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కౌశల్ మాట్లాడాడు. జై కౌశల్.. జై కౌశల్ అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేయడాన్ని చూసి భావోద్వేగానికి గురైన కౌశల్.. ‘‘ఎవరన్నారు? డబ్బుతో కొంటే అభిమానం వస్తుందనీ? కష్టపడితే వస్తుంది. నా కష్టానికి ప్రతిఫలం మీరంతా’’ అని అన్నాడు. ఈ సందర్భంగా ‘కౌశల్ ఆర్మీ’ని ప్రారంభించిన పటేల్‌కు కౌశల్ ధన్యవాదాలు తెలిపాడు.