బయోపిక్ సంస్కృతి తెలుగు సినిమాలో కూడా నెమ్మదించినా కానీ స్థిరంగానే ఉంది. కొన్ని భారీ అంచనాలతో వచ్చి ఫ్లాపైనా మహానటి, మల్లేశం లాంటి బయోపిక్ లు పెద్ద సక్సెసయ్యాయి. వీటితో పాటు మరెన్నో బయోపిక్ లు ఈ మధ్యకాలంలో రిలీజయ్యాయి. ఇప్పుడు మరో బయోపిక్ చిత్రం బయటకు వస్తోంది.
భారతదేశానికి ఒలింపిక్స్ పతకం సాధించిన తెలుగు వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి బయోపిక్ ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, దర్శకుడు కోన వెంకట్ ఈ సోమవారం నాడు ఆవిష్కరించారు. ఎంవివి సత్యనారాయణతో పాటు కోన ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శంకర రెడ్డి దర్శకుడు.
అయితే ఈ చిత్రంలో మల్లేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే సస్పెన్స్ కి తెరవీడలేదు. ఈ చిత్రంలో అనవసరమైన గ్లామర్ షో ఉండదు. ప్రతిభావంతులైన కళాకారిణి హార్డ్ వర్క్ పట్టుదల మాత్రమే కనిపిస్తుంది. యువతరంలో స్ఫూర్తి రగిలించే ఎమోషన్ కి గురి చేసే అంశాలు హైలైల్ గా ఉంటాయట. నేడు మల్లీశ్వరి బర్త్ డే సందర్భంగా తాజా పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నామని కోన తెలిపారు. పాన్ ఇండియా కేటగిరీ మూవీ ఇదని వెల్లడించారు. కరణం మల్లీశ్వరి పాత్రధారి ఎవరు? అన్నది చిత్రబృందం ప్రకటిస్తుందేమో చూడాలి.
On her birthday today, we proudly announce our next, a biopic on @kmmalleswari, FIRST Indian woman to win a medal at Olympics. A multilingual PAN Indian movie! #HBDKarnamMalleswari
🖋️ by @konavenkat99
🎬 by @sanjanareddyd
💰 by @MVVCinema_ & @KonaFilmCorp.#MVVSatyanarayana pic.twitter.com/W2qsBft9iL— Kona Film Corporation (@KonaFilmCorp) June 1, 2020