బాలీవుడ్ యువ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పరోక్షంగా బాలీవుడ్ ఇండస్ర్టీ నుంచి కొందరు పెద్దలు కారణం అంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వెల్లు వెత్తుతోన్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్, పర్హాన్ అక్తర్, రోహిత్ శెట్టి, ప్రకాష్ రాజ్ లాంటి సెలబ్రిటీల ట్వీట్లు వేడెక్కించడంతో సుషాంత్ మరణంపై తెలియని కోణం ఒకటుందని ఫోకస్ అయింది. సుషాంత్ కుటుంబ సభ్యులు హత్యా అంటూ ఆరోపించడం అంతే సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నిర్మాతన కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ వంటి సెలబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇలాంటి వారు కొత్త వాళ్లను ప్రోత్సహించకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా కథనాలు వేడెక్కించాయి.
కరణ్ జోహార్ వారుసుల్నే బాలీవుడ్ కి పరిచయం చేస్తారు. సినీ నేపథ్యంలో ఉన్న పిల్లల్నే ఫోకస్ చేస్తారని..కాపీ విత్ కరణ్ షోకి పేరున్న వారినే పిలుస్తారని ఆరోపించారు. నిజానికి ఓసారి కరణ్ బ్యానర్ ద్వారా పరిచయం అయిన సెలబ్రిటీల జాబితా తిరగేస్తే అందులో కొత్త వారు ఎవరూ కనిపించారు. అంతా స్టార్ కిడ్స్ మాత్రమే కనిపిస్తారు. ఈ నేపథ్యంలో కరణ్ చాలా కాలంగా విమర్శలు ఎదుర్కుంటూనే ఉన్నారు. అయితే సుషాంత్ మరణం తర్వాత ఆ విమర్శలు పీక్స్ కు చేరుకున్నాయి. నేరుగా కరణ్ పేరునే ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో కరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు తన బ్యానర్లో స్టార్ వారసులతో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే ఖరారైన ప్రాజెక్ట్ లను కూడా క్యాన్సిల్ చేసినట్లు కరణ్ ప్రకటించారు. మరి కరణ్ ఇలా ఎన్నాళ్లు వారసులతో సినిమాలు చేయడం మానేస్తారు? ఇది సరైనా నిర్ణయమేనా అంటే? ఎంత మాత్రం కాదనే అనాలి. కరణ్ సినిమా రంగంలో దిగ్గజ వ్యాపారి. నిర్మాతగా, డిస్ర్టిబ్యూటర్ గా దశాబ్ధాలగా కొనసాగుతున్నారు. తాత్కలికంగా ఇప్పుడు సినిమాలు ఆపేసినా మళ్లీ సినిమాలు మొదలు పెట్టాల్సిందే. ఇలాంటి నిర్ణయాలు కన్నా అప్పుడప్పుడు కొత్త వాళ్ల ట్యాలెంట్ ని గుర్తించి వాళ్లతోనూ సినిమాలు చేస్తే ఇలాంటి విమర్శల నుంచి బయటపడే అవకాశం ఉంది.