పుస్త‌క రూపంలో క‌మ‌ల్ ఆత్మ‌క‌థ‌…

                                                        (ధ్యాన్)  

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ `విశ్వ‌రూపం 2`తో ఆగ‌స్ట్ 10న థియేట‌ర్స్ల్ లో సంద‌డి చేయ‌బోతున్నాడు. అయితే సినిమాల ప‌రంగా త‌న‌లాంటి న‌టులు చాలా మందే ఉంటారు. కాబ‌ట్టి తాను రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాన‌ని క‌మ‌ల్ పేర్కొన్నారు. వ‌స్తువుగా ఉన్న తాను ఇప్పుడు ఆయుధంగా మారాన‌ని.. త‌న‌ను ఉపయోగించుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు ఆయ‌న పిలుపు ఇచ్చారు. స్వాతంత్ర్యం కోసం ఇప్ప‌టికే ఓసారి పోరాడాం కాబ‌ట్టి.. మ‌రోసారి పోరాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని క‌మ‌ల్ అన్నారు. ఇదే సంద‌ర్భంలో క‌మ‌ల్ హాస‌న్‌.. త‌న జీవితాన్ని ఆత్మ‌క‌థ‌గా రాయిస్తున్నాడ‌ట‌.  ఇందులో సినిమాలు.. అందులోఎదుర్కొన్న స‌వాళ్ల‌ను తెలియ‌జేస్తూనే అస‌లు తాను రాజ‌కీయాల్లోకి ఎందుకు రావాల్సి వ‌చ్చింద‌నే విష‌యాల‌ను పొందుప‌రుస్తాడ‌ట‌. మ‌రి ఇందులో ఇత‌ర రాజ‌కీయ పార్టీల గురించి ఏమైనా విమ‌ర్శిస్తాడేమో చూడాలి.