కమల్ శంకర్ “ఇండియన్ 2” మొదలైంది

1996 లో సంచలనం సృష్టించిన ఇండియన్ సినిమా సీక్వెల్  వస్తుంది . కమలహాసన్ , శంకర్కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది . నీతికి , న్యాయానికి ప్రతిరూపమైన పాత్రలో కమల్ హాసన్ అద్భుతంగా నటించాడు . మళ్ళీ ఇన్ని సంవత్సరాల  తరువాత  ఈచిత్రం “ఇండియన్ 2” రూపొందబోతుంది . ఇందుకు సంబంధించి పూజా కార్యక్రమం కూడా జరిగింది .

కళా దర్శకుడు టి. ముత్తురాజ్ సెట్స్  వేయడం మొదలు పెట్టాడు . ప్రస్తుతం శంకర్ రజని కాంత్  నటించిన 2. 0 సినిమా విడుదల బిజీలో వున్నాడు . ఈ సినిమా నవంబర్ 29 న విడుదలవుతుంది . ఆ తరువాత శంకర్ ఇండియన్ 2 మీద ద్రుష్టి పెట్టె అవకాశం వుంది .

కమల్ హాసన్ కు ఎంతో ఇష్టమైన సినిమా ఇండియన్ . ఇందులో ఆయన  స్వాతంత్ర  సమర  యోధుడుగా  నటిస్తున్నాడు .

కమలహాసన్ , శంకర్ రెండు దశాబ్దాల తరువాత కలసి చేస్తున్న సినిమా ఇండియన్ .  ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో మొదలయ్యే అవకాశం వుంది . 2020లో విడుదల కావచ్చు .