భారీ వసూళ్లతో దుమ్ము లేపుతున్న “విక్రమ్”..ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే.!

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన పలు ది బెస్ట్ సినిమా లలో తమిళ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్, ఉలగనయగన్ కమల్ హాసన్ ల కాంబోలో వచ్చిన భారీ చిత్రం “విక్రమ్” కూడా ఒకటి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్ ఇంకా సూర్య లు నటించారు అనే మాట పక్కన పెడితే..

వారిని ఎక్కడా తగ్గించకుండా సరైన కథతో ముందుకు నడిపించడం అనేది ఓ రేంజ్ లో ఆడియెన్స్ ని కట్టిపడేసింది. దానికి మించి ఈ సినిమాని మరో సినిమాతో కలపడం అయితే వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. దీనితో ఫస్ట్ డే లోనే మంచి ఓపెనింగ్స్ అందుకొని ఈ చిత్రం భారీ కలెక్షన్స్ అందుకుంది.

అయితే ఈ సినిమా ఇప్పుడు మొదటి వారం పూర్తి చేసుకోగా ఇప్పుడు ఫస్ట్ వీక్ లో ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ళ వివరాలు తెలుస్తున్నాయి. కోలీవుడ్ సినీ వర్గాలు వారు రివీల్ చేసిన దాని ప్రకారం అయితే ఏకంగా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో 250 కోట్ల గ్రాస్ ని అందుకుందట.

ఇది ఓ రకంగా సెన్సేషనల్ అని చెప్పాలి. ఒకవేళ హిందీలో కూడా సరైన వసూళ్లు వచ్చి ఉండి ఉంటే ఈపాటికే 400 కోట్లు వచ్చేసి ఉండేవి. మొత్తానికి అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ నమోదు చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మాణం వహించారు.