“ఇండియన్ 2” పై కమల్ హాసన్ ఇచ్చిన క్రేజీ అప్డేట్ వైరల్.!

ఉలగనయగన్ కమల్ హాసన్ లేటెస్ట్ గా నటించిన చిత్రం “విక్రమ్” తన కెరీర్ లోనే భారీ హిట్ అయ్యింది. దెబ్బకు కమల్ కి ఉన్న అప్పులు అన్నీ తీరిపోయి రివర్స్ లో తానే తన చిత్ర యూనిట్ అందరికీ ఖరీదైన గిఫ్టులు అందిస్తున్నారు. దీనితో కమల్ మాస్ కం బ్యాక్ చూసిన ఆడియెన్స్ అలాగే అభిమానులు మళ్ళీ కమల్ నుంచి ఆ తరహా హిట్స్ కొనసాగాలని అనుకుంటున్నారు. 

అయితే ఈ క్రమంలో కమల్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం అందులో శంకర్ తో ప్లాన్ చేసిన సినిమా “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. ఎప్పుడో 90లలో వచ్చిన ఇండియన్ తెలుగులో “భారతీయుడు” కి సీక్వెల్ గా ఈ చిత్రంని అనౌన్స్ చేసారు. ఆ సినిమాకి సీక్వెల్ కావడంతో మంచి అంచనాలే నెలకొన్నాయి. 

కానీ అనూహ్యంగా ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయి శంకర్ కి నిర్మాణ సంస్థ లైకా వారికి పడకపోవడంతో శంకర్ మధ్యలోనే బయటకి వచ్చేసారు. ఆ తర్వాత కోర్టులు అని సెటిల్మెంట్స్ అని చాలానే రచ్చ నడిచింది. కానీ ఫైనల్ గా శంకర్ మళ్ళీ తానే డైరెక్ట్ చేసేందుకు ఒప్పుకున్నారు. దీనితో ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చింది. 

అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ పై అయితే ఒక బిగ్ క్లారిటీని కమల్ ఇవ్వడం వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ ని శంకర్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడని నిజానికి ఫ్యాన్స్ కన్నా నేనే ఎక్కువ ఆసక్తిగా ఉన్నానని ప్రస్తుతం శంకర్ చేస్తున్న సినిమా కంప్లీట్ అయ్యిన వెంటనే ఇండియన్ 2 లో జాయిన్ అవుతారని కమల్ క్లారిటీ ఇచ్చారు. దీనితో ఇది పాన్ ఇండియా సినిమా దగ్గర వైరల్ గా మారింది.