(సూర్యం)
రజనీకాంత్‌ను కాకుండా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ‘ప్రజలు సరైన అభ్యర్థిని ఎంచుకుంటారు.. ప్రముఖ వ్యక్తిని కాదు’ అని డైరక్ట్ గా
కౌంటర్ వేసారు కమల్ .
అంటే తాను రజనీ అంత క్రేజ్ లేకపోయినా సరైన అభ్యర్ది అని చెప్పకనే చెప్పారు. ఇది రజనీ అభిమానులకు మండుకొస్తోంది. అయితే ఆయన ఏమీ పర్శనల్ గా అనలేదు కదా..రాజకీయాల్లో భాగంగా ఆ మాట మాట్లాడారు అని సోషల్ మీడియాలో కమల్ అభిమానులు వెనకేసుకువస్తున్నారు.
ప్రముఖ హీరో కమల్‌హాసన్ ‘మక్కల్ నీది మయ్యం (ప్రజా న్యాయ వేదిక)’ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా తమ పార్టీ లో సభ్యుల జాబితాను కూడా ఆయన ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలో వెల్లడించారు. ఈ నేపధ్యంలో కమల్ తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఇలా చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నట్లు తెలిపిన ఆయన రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తన ఆస్దిని సీజ్ చేసారని అన్నారు.
కమల్ మాట్లాడుతూ…‘ఓ కామెంట్ చేసినందుకు నాకు రాజకీయ నాయకుల నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. నా ఆస్తుల్ని దాదాపు సీజ్ చేసేశారు. ఇది నాకు గుణ పాఠం నేర్పింది’ అని చెప్పారు.
ఇక తమ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ లక్ష్యం గురించి చెప్తూ…‘ నా పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’కు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. మేం ఇప్పటికీ వాటి కోసం సాధన చేస్తున్నాం. మాకు సలహాలు ఇచ్చే గొప్ప వ్యక్తులున్నారు’అన్నారు.