బాల నటుడిగాటాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి పరిచయమైన కళ్యాణ్ ‘తొలిచూపులోనే ‘ అనే సినిమా ద్వార హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా హిట్టు కాలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన అభిమన్యు సినిమా కూడా నిరాశ పరిచింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా కూడా మారి ఎన్నో సినిమాలని నిర్మిస్తూ మరొక వైపు నటిస్తూ బిజిగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన పటాస్ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్ అందుకున్నాడు. కానీ తర్వాత ఆయన నటించిన సినిమాలు ఎక్కువ ప్లాప్ అయ్యాయి.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బింబిసార అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ఆగష్టు 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ ఇటీవల హీరోగా ఇండస్ట్రీలో తన ఎంట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ఒక వీడియో షేర్ చేశాడు. 1989 లో కళ్యాణ్ రామ్ బాలగోపాలుడు సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే కళ్యాణ్ రామ్ ఆ సినిమాలో మొదటిసారిగా నటించటానికి కారణం మాత్రం బాలకృష్ణ. 1989 లో బాలకృష్ణ హరికృష్ణ వద్దకు వచ్చి కళ్యాణ్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చెద్దామని చెప్పాడట.
అయితే చిన్న వయసులో సినిమాలలోకి పంపితే భవిషత్తు మీద వ్యాపకం తగ్గుతుందని హరికృష్ణ కొంచం సంకొచిస్తుంటే.. నువు దిగులు పడాల్సిన అవసరం లేదు .. అంతా నేను చూసుకుంటా అని బాలకృష్ణ దైర్యం చెప్పారని ఈ వీడియోలో కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. మా బాబాయ్ వల్ల నేనిరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను. ఆయనే లేకపోతే నా జీవితం మరోలా ఉండేదని కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. పిల్లలకి చవుడుకోవటానికి అక్షరాభ్యాసం చేసినట్టు సినిమాలలో అక్షరాభ్యాసం నాకు మా బాబాయ్ చేశాడు అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.