మళ్ళీ మెగాస్టార్ సరసన చందమామ కాజల్?

కాజల్ అగర్వాల్

హీరోయిన్ కాజల్ కెరీర్ ప్రస్తుతం బాగా లేదనే చెప్పాలి. చేతిలో ఒకటీ అరా తప్ప అవకాశంలేమీ లేవు. ఈ సమయంలో ఒక పెద్ద అవకాశం వస్తే మళ్ళీ కెరీర్ పుంజుకుంటుంది అనుకునే లోగా అలాంటి అవకాశం తలుపు తట్టింది.

కొరటాల శివ-మెగాస్టార్ చిరు చేస్తున్న సినిమాలో, చిరు సరసన హీరోయిన్ కోసం చాలా మంది పేర్లను పరిశీలించారు. కానీ ఆ అవకాశం చివరికి కాజల్ అగర్వాల్ కి దక్కినట్టు సమాచారం. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు అయింది కాజల్ పరిస్థితి.

తాను ఏ ప్రాజెక్ట్ కోసo కలలు కంటోందో అదే వచ్చినట్టు అయింది. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన చిరు పుట్టిన రోజు ఆగష్టు 22 న వచ్చే అవకాశం ఉంది.