`పొన్మగల్ వంధల్` OTT ప్లాట్‌ఫాంపై నేరుగా వచ్చిన మొదటి పెద్ద తమిళ చిత్రం. ఇది ఇప్పుడు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. నిన్న రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. అసలింతకీ ఈ సినిమా ఎలా ఉంది? అంటే..
ఈ చిత్రం కోర్టు డ్రామా. జ్యోతిక, పార్తిబన్, భాగ్యరాజా లాంటి గొప్ప స్టార్ల నట ప్రతిభ మెస్మరైజ్ చేస్తుంది. జ్యోతి(జ్యోతిక) అనే అమ్మాయి సీరియల్ కిల్లర్. జ్యోతి తన కేసులతో పోరాడుతుంది. ఆమె ఎందుకు హత్యలు చేస్తోంది? అన్నది మొత్తం ట్విస్ట్.
ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు. పెర్ఫామెన్సెస్ బావున్నా మూవీలో కొన్ని లోపాలున్నాయి. ముఖ్యంగా ఎడిటింగ్ ఏమంత బాలేదు. పైగా ఇలాంటివి పెద్ద-స్క్రీన్ వీక్షణ కోసం పనికిరావు. OTT లో మంచి టైమ్ పాస్ అనడంలో సందేహమేం లేదు. ఇలాంటివి థియేటర్లలోనే రావాలి అని ఎగ్జిబిటర్లు సూర్యపై పోరాడింది అనవసరమేనని చెప్పుకోవచ్చు.
A fight for justice,
A journey with a reason! 🔥Presenting the #PonmagalVandhalTrailer starring #Jyotika! 💯
Hit play➡️ https://t.co/1kKXsjdDLf@Suriya_offl @2D_ENTPVTLTD @fredrickjj @rajsekarpandian @govind_vasantha @rparthiepan @ppothen @actorthiagaraja @PrimeVideoIN pic.twitter.com/QcGAoLeNxz
— Sony Music South (@SonyMusicSouth) May 22, 2020