ఈ సారి చిన్న దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్..?

ప్రస్తుత రోజుల్లో యువ దర్శకులు ఒక చిన్న సినిమాతో వారి టేలెంట్ ను నీరూపించుకోగలిగితే చాలు.. స్టార్ హీరోలతో ఈజీగా ఛాన్స్ కొట్టేయవచ్చు. ఫైనల్ గా కథ వేడిగా ఉంటే చాలు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా కరిగిపోవాల్సిందే. ఇక త్వరలో జూనియర్ ఎన్టీఆర్ ను మెప్పించడానికి ఒక యువ దర్శకుడు చాలా బలంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు ఈ సరికొత్త కాంబినేషన్ ను సెట్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.

ఇక ఆ దర్శకుడు మరెవరో కాదు శైలేష్ కొలను. నాని వాల్ పోస్టర్ బ్యానర్ లో వచ్చిన HIT సినిమాకు దర్శకత్వం వహించిన ఈ యువకుడు మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక సెకండ్ మూవీ నానితో చేస్తాడని టాక్ వచ్చింది. అలాగే హిట్ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే రీసెంట్ గా నిర్మాత దిల్ రాజు వద్దకు వెళ్లిన శైలేష్ తన దగ్గర ఉన్న యాక్షన్ కథను వినిపించాడట. ఆ కథ ఎన్టీఆర్ కు అయితే సెట్టవుతుందని మీటింగ్ సెట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న తారక్ శైలేష్ లాంటి యంగ్ డైరెక్టర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం RRR ఫినిష్ చేసే పనిలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు దిల్ రాజు హిట్ దర్శకుడిని లైన్ లో పెట్టడంతో తారక్ ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.