మహేష్ తో అనుకుంటే సీన్ లోకి ఎన్టీఆర్‌..!

ఒక హీరోతో అనుకున్న ప్రాజెక్టు మరో హీరోకు మారటం సిని పరిశ్రమలో సర్వ సాధారణం. ముఖ్యంగా స్టార్ హీరోలతో అనుకున్నప్పుడు డేట్స్ ఎడ్జెస్ట్ కాక డైరక్టర్స్ మారిపోతూంటారు. మహేష్ తో సినిమా అనుకున్న అర్జున్ రెడ్డి దర్శకుడుకి అదే పరిస్దితి ఎదురైందిట. ఓ క్రైమ్ కథను మహేష్ కు నేరేట్ చేసిన ఆయనకు గ్రీన్ సిగ్నల్ రాకపోవటంతో ఎన్టీఆర్ తో ముందుకు వెళ్దామని ఫిక్స్ అయ్యాడట.

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్‌ రెడ్డి సంచలన విజయం సాదించటంతో సందీప్ పెడ్డి..సినీ ప్రముఖులు స్టార్ హీరోల ప్రశంసలు సాధించింది. దీంతో సందీప్‌తో సినిమాలు చేసేందుకు హీరోలు దర్శకులు క్యూ కట్టారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రస్తుతం అర్జున్‌ రెడ్డి సినిమాను కబీర్‌ ఖాన్‌ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేయటానికి వెళ్లిపోయారు సందీప్‌. ఇంత వరకు తెలుగు సినిమాను ప్రకటించలేదు.

అయితే కొద్ది రోజులుగా మహేష్ బాబు హీరోగా సందీప్‌ సినిమా ఉంటుదన్న టాక్‌ గట్టిగా వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం సందీప్.. ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్‌కు కథ కూడా వినిపించాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌.. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌ (వర్కింగ్‌ టైటిల్‌)లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత సందీప్‌ సినిమా ఉండే చాన్స్‌ ఉందని తెలుస్తోంది.