స్వీయ నిర్బంధం సెలబ్రిటీలకు బోలెడన్ని పాఠాల్ని నేర్పిస్తోంది. లావిష్ సెలబ్రిటీ పెళ్లిళ్లకు చెక్ పెట్టేసిన కరోనా.. సెల్ఫ్ క్వారంటైన్ లో స్కిల్ పెంచుకునేందుకు సాయమవుతోంది. ఆ రకంగానే తాజాగా అందాల శ్రుతిహాసన్ సెల్ఫ్ షాట్ ఫోటోషూట్ ని అలవర్చుకుంది. తాజా సెల్ఫ్ షూట్ తో హీట్ పెంచేస్తోంది. అది కూడా ప్రఖ్యాత జేఎఫ్ డబ్ల్యూ కోసం సొంతంగా ఒక కెమెరాని సిద్ధం చేసుకుని తనకు తానుగానే డిజైనర్ లుక్ ని ప్లాన్ చేసుకుని మరీ ఫోటోషూట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోల్ని మ్యాగజైన్ కవర్ పేజీ కోసం పంపించింది.
వీటిలో ఓ అద్భుతమైన ఫోటోని కవర్ పేజీ కోసం ఎంపిక చేసుకున్న జేఎఫ్‌డబ్ల్యూ వాళ్లు జూలై కవర్ పేజీని శ్రుతి ఫోటోతోనే సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. తాజాగా ఈ సిరీస్ నుంచి రెండో ఫోటో రిలీజైంది. ఈ ఫోటోలో శ్రుతి పింక్ లుక్ లో అదరగొట్టేసింది. శ్రుతి ఎక్స్ ప్లోజివ్ లుక్ కి సంబంధించిన ఫోటో వాట్సాపుల్లో వైరల్ గా మారింది.
పింక్ డిజైనర్ లుక్ తనకు తానుగా ఎంపిక చేసుకున్నదే. ఆ డిజైనర్ డ్రెస్ ఇన్ వోర్ గా బంగారు వర్ణం లోహపు కడియాల్ని ధరించి సెగలు పుట్టించింది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ ఫోటోలు అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతున్నాయి. తాజాగా రివీలైన సెకండ్ ఫోటోలో శ్రుతి కిల్లింగ్ లుక్ వైరల్ గా మారింది. ఇక ఈ భామ కెరీర్ సంగతి పరిశీలిస్తే .. మాస్ మహారాజా రవితేజ సరసన క్రాక్ చిత్రంలో నటిస్తోంది. అటు తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.