జార్జియాలో జగపతి బాబు

తెలుగు తమిళ , హిందీ రంగాల్లో జగపతి బాబు ప్రతి నాయక పాత్రలను పోషిస్తున్నాడు . ప్రస్తుతం ఆయన కాల్ షీట్స్ దొరకటం కష్టమై పోతుంది . ప్రస్తుతం ఆయన  జార్జియాలో వున్నాడు .

చిరంజీవి ,నయన తార జంటగా నటిస్తున్న “సైరా  నరసింహా రెడ్డి ” చిత్రం షూటింగ్ జార్జియాలో జరుగుతుంది . గత నెల రోజుల నుంచి యూనిట్ ఆ దేశంలోనే ఉండి యుద్ధ సన్ని వేశాలను చిత్రీకరిస్తున్నది . సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు . అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో సైరా నరసింహారెడ్డి గురువు పాత్రలో నటిస్తున్నాడు .

జగపతి బాబు ప్రతి నాయకుడు పాత్రలో నటిస్తున్నాడు . రెండు రోజుల క్రితమే ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనడానికి జార్జియా దేశానికి వెళ్ళాడు . యుద్ధ సన్నివేశాల్లో చిరంజీవితో పాల్గొంటాడు .  ఈనెల 13 వ తేదికి హైదరాబాద్ వస్తాడు.

జగపతి బాబు ప్రతి నాయకుడుగా నటించిన “అరవింద సమేత .. వీర రాఘవ “సినిమా 11 న విడుదలవుతుంది . ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్  దర్శకుడు . జగపతి బాబు వచ్చిన తరువాత అరవింద సమేత .చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొంటానని తెలుగు రాజ్యం కు  చెప్పాడు .