రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’పూర్తి కథ ఇదే

మాస్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ బోయపాటి శ్రీను. ‘భద్ర’ నుంచి ‘జయ జానకి నాయక’ వరకూ ఆయన సినిమాల్లో హీరోని ప్రెజెంట్ చేసే విధానం పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉండటం గమనించవచ్చు. అందుకేనేమో దాదాపు ఆయన సినిమాలన్నీ కమర్షియల్‌ హిట్స్‌. తాజాగా రామ్‌చరణ్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. కియారా అడ్వాణీ హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలో ఈ సినిమా కథ ని మీ ముందు ఉంచుతున్నాం..

ఈ సినిమా ..నలుగురు అనాధలుకు అప్పుడే పుట్టిన చిన్న బాబు..రైల్ ట్రాక్ వద్ద దొరుకుతాడు. వాళ్లు వాడిని చేరదీస్తారు. అక్కడ నుంచి వాళ్లు నలుగురూ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా తిరుగుతారు..పెరుగుతారు. ఏడేళ్ల వయస్సు సో తన అన్నదమ్ముల కోసం రౌడీలతో పోరాడతాడు. దాంతో వాళ్లకు మరీ ప్రాణమైపోతాడు.

పెరిగి పెద్దైన వాళ్లు నలుగురూ జాబ్స్ సంపాదించుకుంటారు. పేరు సంపాదించుకుంటారకు. కానీ హీరో రామ్ చరణ్ మాత్రం ఉద్యోగం ఏమీ చెయ్యడు..సరదాగా కాలక్షేపం చేస్తూంటారు. కుటుంబంలో అందరూ గారం చేస్తూంటారు. అంతా చాలా హ్యాపీగా నడిచే కుటుంబంలో ఓ రోజు అనుకోని అవాంతరం వస్తుంది. పెద్ద అన్నయ్య ప్రశాంత్ బీహార్ లోని ఓ గ్రామంలో ఎలక్షన్స్ కు అధికారిగా వెళ్లతాడు. అక్కడ వివేక్ ఒబరాయ్ ఓ నియంతలా రాజ్యం ఏలుతూంటాడు. వివేక్ ఒబరాయ్ గ్యాంగ్ ని ఎదుర్కొంటాడు.

దాంతో వాళ్లు అతన్ని చంపేస్తారు. రామ్ చరణ్ తన సోదరుడుని చంపిన వాళ్లను వదలకూడదని నిర్ణయించుకుంటాడు. వివేక్ ఒబయార్ ని వేటాడతాడు. అయితే అతను చచ్చిపోయాడనుకుని వెనక్కి వస్తాడు. కానీ వివేక్ ఒబరాయ్ కోమాలో ఉంటాడు. ఇక రామ్ చరణ్ తమ పెద్దన్న ప్రశాంత్ చనిపోయిన విషయం మిగతా వాళ్లకు ఎవరికీ చెప్పకుండా మ్యానేజ్ చేస్తూంటాడు. ఎక్కడో ఉద్యోగం కోసం బిజీగా ఉన్నట్లు నమ్మిస్తూంటాడు.

ప్రధమార్దం చివర్లో..ఇంటర్వెల్ దగ్గర ప్రశాంత్ చనిపోయిన విషయం కుటుంబానికి తెలుస్తుంది. అదే సమయంలో వివేక్ ఒబరాయ్ కూడా బ్రతికే ఉన్నాడని రామ్ చరణ్ కు తెలుస్తుంది. అక్కడ నుంచి రివేంజ్ డ్రామా ప్రారంభం అవుతుంది. ఓ ప్రక్క వివేక్ ఒబరాయ్ ..రామ్ చరణ్ కుటంబాన్ని నాశనం చేయాలని చూస్తూంటాడు. రామ్ చరణ్ ఎలా తన ఫ్యామిలీని కాపాడుకున్నాడనేది మిగతా కథ.

 ఈ కథ ఎంతవరకూ నిజం అనేది రేపు ఉదయం కల్లా తెలిసిపోతుంది. ఇదే కథ అయితే మాత్రం పరమ రొటీన్ గా ఉన్నట్లే…చూడాలి..ఎలా ఉండబోతోందో..