బాలీవుడ్ లో ఒక అనామకుడు హీరోగా స్టార్ డమ్ సంపాదించడం అంటే మాటలు కాదు. కానీ అది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సాధించాడు. చివరికీ అనేక అనుమానాలను అపోహలను మిగిల్చి ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం సుశాంత్కేసుని గమనిస్తే.. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి దాదాపు ఆ కేసు చిక్కుల్లో పడి నలిగిపోక తప్పని పరిస్థితిలా ఉంది. సుశాంత్ ఈ లోకాన్ని వీడి అప్పుడే రెండు నెలలు కావొస్తోంది. నిజంగా 57 రోజులైందంటే నమ్మశక్యం కావడం లేదు. అయినా రోజురోజుకు సుశాంత్ మరణం పై కొత్త కొత్త కథనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
సుశాంత్ తండ్రిలో అతని కుటుంబంలో చెలరేగుతున్న బాధను.. ఆ బాధ తాలూకు భావోద్వేగాలను ఎదుర్కోడానికి వాళ్ళు పడుతున్న కష్టాన్ని మాటల్లో చెప్పలేమంటూ వారి బాధ గురించి బాలీవుడ్ మీడియా చూపించింది. రోజూ వాళ్ళను టీవీలో ఏదొక సందర్భంలో చూపిస్తున్నారు. కానీ ఇంతవరకూ తమ కుమారుడు ఎందుకు చనిపోయాడో కూడా ఆ తండ్రికి క్లారిటీ రాలేదు. ఇంత పెద్ద దేశంలో ఒక వ్యక్తి ఆత్మహత్య తాలూకు కారణాన్ని కనుక్కోవడానికి ఇన్ని విచారణలు అవసరమా ? అయితే సుశాంత్ వాడిన ఫోన్ లో సమాచారాన్ని బట్టి సుశాంత్ చావు వెనుక ఏదో బలమైన కారణమే ఉందని తెలుస్తోంది.
ఫైనల్ గా సుశాంత్ చావు వెనుక అతని ప్రియసి నిర్లక్ష్యం.. మోసపూరిత తనం ఉన్నట్లు రుజువు అయ్యేలా ఉంది. రియా చక్రవర్తి సుశాంత్ గురించి గతంలో ఒక పోస్ట్ చేసింది. ‘నీకోసం ఎంతో ఎదురు చూస్తుంటాను. నిన్ను మళ్లీ తిరిగి నా దగ్గరకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నువ్వు అందమైన, గొప్ప వ్యక్తివి. మన మధ్య ఉన్న ప్రేమను మాటల్లో వ్యక్తపరచలేక పోతున్నాయి. నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. నీకు శాశ్వతంగా కనెక్టు అయ్యాను అని’. ఈ పోస్ట్ చూసిన ఎవరికైనా రియా, సుశాంత్ ని ఎంతలా ప్రేమించి ఉంటుంది అని గొప్పగా అనుకుంటారు కదా. కానీ ప్రస్తుతం జరుగుతున్న వాస్తవ పరిస్థితులు రియా మోసాన్ని బయటపెడుతున్నాయి.