అతను గనక బిగ్ బాస్ 4లో అడుగుపెడితే .. మాటీవీకి టి‌ఆర్‌పి పండగే పండగ!

బుల్లితెర‌పై అత్యంత వివాదాస్ప‌ద‌మైన రియాలిటీ షో ఏది? అంటే `బిగ్ బాస్` అని ఠ‌క్కున చెప్పేస్తారు. వివాదంతో వినోదం ఈ షో ప్ర‌త్యేక‌త‌. అందుకే హిందీ స‌హా అన్ని భాష‌ల్లోనూ స‌క్సెసైంది. స్టార్ మా వాళ్లు ఇప్ప‌టికే తెలుగులో మూడు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా ర‌న్ చేశారు. ఈ మూడు సీజ‌న్ల‌లో గ్లామ‌ర్ ఉన్నా.. ఈసారి అంత‌కుమించి గ్లామ‌ర్ పెంచేందుకు .. ప్ర‌తిభావంతుల్ని వెతికేందుకు ప్రాధాన్య‌త‌నిచ్చార‌ట‌.

ఇది నిజంగానే బిగ్ బాస్ వీక్ష‌కుల‌ను ఎగ్జ‌యిట్ చేసే విష‌య‌మే. ఈసారి మునుప‌టి కంటే ఎక్కువ‌గా గ్లామ‌ర్ షో ఉంటుంది. వివాదాలు ఉంటాయి. దాంతో పాటే హౌస్ లో డ్యాన్సుల‌తో అద‌ర‌గొడ‌తార‌ట‌. మాస్ కి విందు వినోదానికి ప‌సందైన డ్యాన్స్ మూవ్ మెంట్స్ కి కొద‌వేమీ ఉండ‌ద‌ట‌. అందుకోసం ప్ర‌త్యేకించి ఓ స్టార్ కొరియోగ్రాఫ‌ర్ ని బ‌రిలో దించుతున్నార‌ని తెలుస్తోంది. ఇంత‌కీ ఎవ‌రాయ‌న? అంటే.. త‌న‌వైన స్టెప్పుల‌‌తో చార్ట్ బ‌స్ట‌ర్ పాట‌ల‌కు కొరియోగ్ర‌ఫీ అందిస్తున్న‌ జానీ మాస్టార్ బ‌రిలో దిగుతున్నార‌ట‌.

ఈ షోలో పాల్గొనేందుకు అత‌డు భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినా ఇచ్చేందుకు `స్టార్ మా` వాళ్లు అంగీక‌రించార‌ట‌. అలాగే జానీ మాస్టార్ తో పాటుగా ప్ర‌ముఖ గ్లామ‌ర‌స్ యాంక‌ర్లు.. క‌థానాయిక‌ల ట్రీట్ బిగ్ బాస్ షో ఆద్యంతం వేడెక్కించ‌నుంద‌ట‌. దాదాపు 100రోజుల పాటు సాగే ఈ రియాలిటీ షో ఆద్యంతం జానీ మాస్టార్ డ్యాన్సుల‌తో మాంచి జోష్ కొన‌సాగుతుంద‌నే భావించ‌వ‌చ్చు. ఇక బిగ్ బాస్ సీజ‌న్ 3లో బాబా మాస్టార్ డ్యాన్సుల‌తో పాటు కామెడీతోనూ ఆక‌ట్టుకున్నారు. ఇంటి స‌భ్యుల్లో తుదికంటా కాంపిటీట‌ర్ గా నిలిచిన సంగ‌తి విధిత‌మే.