కొమ‌రం భీమ్ ప్ర‌పంచం క‌ళ్లు తిప్పుకోనివ్వ‌దా?

ప్ర‌స్తుత లాక్ డౌన్ స‌న్నివేశం పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ కి అన్ని విధాలా న‌ష్టం క‌లిగించిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి – దాన‌య్య బృందం ప‌దే ప‌దే రిలీజ్ తేదీలు మార్చాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. ఇంకా 20 శాతం పెండింగ్ షూటింగ్ చేయాలి. భారీగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ చేయాల్సి ఉండ‌డంతో 2021 సంక్రాంతికి రిలీజ్ చేయ‌లేమ‌ని ఇప్ప‌టికే చేతులెత్తేశారు. స‌మ్మ‌ర్ కి అయినా వ‌స్తుందా? అంటే డౌటేన‌న్న ముచ్చ‌ట సాగుతోంది.

అదంతా అటుంచితే క‌థానాయ‌కులు చ‌ర‌ణ్ .. తార‌క్ బ‌ర్త్ డేల‌కు ఫ‌స్ట్ లుక్ లు రిలీజ్ చేస్తార‌ని భావించిన అభిమానుల‌కు ఆ ట్రీట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది రాజ‌మౌళి టీమ్. ఇంత‌కుముందు చ‌ర‌ణ్ బ‌ర్త్ డేకి అల్లూరి సీతారామ‌రాజు లుక్ ని రిలీజ్ చేస్తే మంచి స్పంద‌న వ‌చ్చింది. మోష‌న్ పోస్ట‌ర్ కం టీజ‌ర్ అల‌రించింది. నేడు (మే 20) ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా కొమ‌రం భీమ్ లుక్ రిలీజ‌వుతుంద‌ని అభిమానులు ఆస‌క్తిగా వేచి చూశారు. కానీ ప్ర‌స్తుత మ‌హ‌మ్మారీ స‌న్నివేశం తీవ్ర ఆటంకం క‌లిగించింది. క‌నీసం టీజ‌ర్ క‌ట్ చేసేందుకైనా అవ‌కాశం లేకుండా పోయింది. తెలంగాణ ప్ర‌భుత్వం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ చేసుకునేందుకు కూడా అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో ల్యాబుల్లో ప‌ని చేయ‌లేక‌పోయారు. అలాగే తార‌క్ పై విజువ‌ల్స్ కూడా స‌రిపోలేద‌ని తెలిసింది.

దీంతో ఒక‌రోజు ముందే తార‌క్ త‌న అభిమానుల‌కు టీజ‌ర్ ని ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని తెలుపుతూ క్ష‌మాప‌ణ‌లు కోరారు. రాజ‌మౌళి అండ్ టీమ్ చాలా ముందే ఈ విష‌యాన్ని అభిమానుల‌కు క‌న్వే చేశారు. ఎట్ట‌కేల‌కు నేడు బ‌ర్త్ డే సంద‌ర్భంగా తార‌క్ కి సంబంధించిన సినిమా లుక్ రిలీజ్ చేయ‌కుండా ఒక టీష‌ర్ట్ లో క‌నిపిస్తున్న ఫోటోని రిలీజ్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ టీమ్ అధికారికంగా సోష‌ల్ మీడియాలో బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపింది. ఆఫ్ ద స్క్రీన్.. ఆన్ ద స్క్రీన్ తార‌క్ ఎన‌ర్జీ ఉత్సాహం వేరు. కొమ‌రం భీమ్ వ‌ర‌ల్డ్ ని చూపించే వ‌ర‌కూ ఆగ‌లేకపోతున్నాం అని తెలిపారు. అంటే కొమ‌రం భీమ్ ప్ర‌పంచం క‌ళ్లు తిప్పుకోలేనంత స్పెష‌ల్ గా ఉంటుందా? అన్న‌ది చూడాలి.