ఎఫ్ 2 ఫీట్ రిపీట‌వుతుందా హ‌నీ?

అందంతో పాటు అదృష్టం క‌లిసొస్తోనే ప‌రిశ్ర‌మ‌లో రాణించ‌గ‌ల‌రు. ఆ కోవ‌లో చూస్తే అందం ఉన్నా అదృష్టం క‌లిసి రాని నాయిక‌గా మెహ్రీన్ పేరు మార్మోగింది. ఆరంభం వ‌రుస ఫ్లాపుల‌తో అలా అలా కాల‌క్షేపం చేసేసిన ఈ అమ్మ‌డు గ‌త ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 రూపంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. అయితే అదే ఏడాది చాణ‌క్య లాంటి ఫ్లాప్ ఎదురైంది. దీంతో మళ్లీ పెద్ద హిట్ ప‌డాల్సిన ప‌రిస్థితి.

2020లో మెహ్రీన్ కెరీర్ బిగ్ ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఈ సంక్రాంతికి `ఎంత మంచివాడవురా` చిత్రంతో ల‌క్ చెక్ చేసుకోబోతోంది. అశ్వథ్ధామ ఈ ఏడాది రిలీజ‌వుతోంది. కళ్యాణ్ రామ్ జోడీగా సతీష్ వెగేశ్న డైరెక్షన్లో నటించిన `ఎంత మంచివాడవురా` జనవరి 15న, నాగశౌర్యతో కలిసి చేసిన `అశ్వథ్ధామ` జనవరి 31న విడుదలకానున్నాయి. ఈ రెండిటి ఫ‌లితం త‌న‌కు చాలా ఇంపార్టెంట్. 2020 త‌న‌కు ఏ మేర‌కు క‌లిసి రానుంది అన్న‌ది చూడాలి. కొత్త ఏడాదిలో జ‌న‌వ‌రి త‌న‌కు అత్యంత కీల‌కం.