నాగార్జున‌ ‘దేవదాస్ ’ కొంపదీసి కాపీయా???

నాగార్జున‌, నాని క‌లిసి న‌టిస్తోన్న సినిమా `దేవ‌దాస్‌`. దేవ‌గా నాగార్జున డాన్ పాత్ర‌లోనూ, దాస్‌గా నాని డాక్ట‌ర్ పాత్ర‌లోనూ న‌టిస్తున్నారు. షూటింగ్‌లో నాని మాట్లాడే అచ్చ తెలుగు ప‌లుకులు వింటే త‌న‌కు ముద్దొస్తోంద‌ని నాగార్జున ఇప్ప‌టికే చెప్పారు. రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించేశారు. సెప్టెంబ‌ర్ 27న దేవ‌దాస్ విడుద‌ల అని ప్ర‌క‌టించేశారు కూడా. అంతా బాగానే ఉంది.. కానీ ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుద‌లైన త‌ర్వాత దాన్ని చూసిన అంద‌రూ ఇది హాలీవుడ్ మూవీ `అన‌లైజ్ దిస్` అనే సినిమానుపోలి ఉంటుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే స‌ద‌రు హాలీవుడ్ సినిమా రైట్స్ తీసుకుని సినిమా చేశారా?  లేదా అని తెలియాల్సి ఉంది. ఒక‌వేళ నాగార్జున ఇలాంటి విష‌యం తెలిస్తే… ముందుగానే రీమేక్ రైట్స్ తీసుకుని  రీమేక్ చేయ‌మంటాడు. అందుకు ఉదాహ‌ర‌ణ నాగ్, కార్తీ న‌టించిన `ఊపిరి` కూడా ఫ్రెంచ్ మూవీకి రీమేకే. ఆ విష‌యాన్ని బాహాటంగానే.. ముందుగానే చెప్పేశారు. ఒక వేళ రీమేకో… ఇన్‌స్పిరేష‌న్ ఆధారంగా క‌థ‌ను త‌యారు చేసుకున్నారో కానీ..  ఆ విష‌యాన్ని నాగార్జున‌కు చెప్పారో లేదో తెలియ‌డం లేదు. అయితే ఇప్పుడు  అన‌లైజ్ దిజ్ అని ఇన్‌స్పిరేష‌న్ దేవ‌దాస్ అని విన‌ప‌డుతున్న వార్త‌ల‌కు చిత్ర యూనిట్ ఏమ‌ని స్పందిస్తుందో చూడాలి.