ఆ ఇద్దరు హీరోల బాండింగ్ బాలయ్య ఎగ్జిట్‌కి కారణమా?
నటసింహా నందమూరి బాలకృష్ణలో ఊహించని అసంతృప్తి ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ కి నాలుగు పిల్లర్స్ గా చెప్పుకునే నలుగురు హీరోల్లో నేను లేనా? అనేదే ఆయన ఆందోళన. చిరంజీవి- నాగార్జున- వెంకటేష్ – బాలకృష్ణ నలుగురు సీనియర్ హీరోలు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తర్వాత దశాబ్ధాల పాటు సుదీర్ఘ కాలం ఒక ఎరాలో ఏలిన హీరోలుగా పేరు బడ్డారు. అందువల్ల పరిశ్రమకు పిల్లర్స్ గానే పరిగణించబడ్డారు.
చిరంజీవి కంటే నేనే గొప్ప అనుకునే బాలయ్య అహానికి ఊహించని పంచ్ పడిపోయింది. ఇటీవల ఊహించని పరిణామాలు బాలయ్యను చిన్నబుచ్చుకునేలా చేశాయి. చిరంజీవి- నాగార్జున మిత్రబృందం నటసింహాన్ని పక్కన పెట్టేయడంతో అది కాస్తా ఆయనలో అసహనపు చిచ్చు రాజేసింది. మెగా – నందమూరి క్లాష్ అనేది దశాబ్ధాలుగా ఉన్నదే. వృత్తిగతంగా.. వ్యక్తిగతంగా ఆ ఇద్దరి మధ్యా రాజుకుంటూనే ఉంటుంది. ఇరువురి అభిమానుల మధ్య ఈ గొడవ ఎప్పటికీ ఆరనిది. ఇక బాలయ్యతో కింగ్ నాగార్జునకు అస్సలు పొసగదని ఇండస్ట్రీలో గుసగుస. ఏఎన్నార్ బతికి ఉన్నప్పుడే బాలయ్యతో కింగ్ కి సరిపడలేదు. అందుకే ఆ ఇద్దరూ కలిసే బాలయ్యను సైడేస్తున్నారా? చిరు-నాగార్జున ఫ్రెండ్సిప్ కూడా ఇందుకు ఆజ్యం పోస్తోందా? అన్న సందేహం కూడా ఇండస్ట్రీలో ఉంది.
ఇకపోతే పొలిటికల్ గా కింగ్ నాగార్జున ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కి సన్నిహితుడు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇటీవల దగ్గరయిపోయారు. వైకాపా ప్రత్యర్థి నాయకుడిగా బాలయ్య ఎప్పటికీ జగన్ కి దూరమే. ఈ పరిణామాలు కూడా ఆసక్తికర సన్నివేశానికి తెర తీస్తున్నాయి. ప్రస్తుతం వైజాగ్ టాలీవుడ్ అభివృద్ధి.. స్టూడియోల నిర్మాణం అంటూ హడావుడి చూస్తున్నదే. దీనిని పరిశ్రమ పిల్లర్స్ లో చిరంజీవి- నాగార్జున ముందుండి నడిపించే వీలుంది. ఆ ఇద్దరితో బాలయ్యకు పొసగదు కాబట్టి ఆయన్ని దూరం పెట్టేసినట్టేనన్న ఊహాగానాలు సాగుతున్నాయి. అందుకేనేమో బాలయ్య ఎంతో ఆలోచించి భూములు పంచుకునేందుకే!! అంటూ ఆరంభమే డైలాగ్ విసిరి దొరికిపోయారు.
అన్నట్టు తేదేపా ప్రభుత్వ హయాంలో ఏపీఎఫ్‌డీసీకి వైజాగ్ లో ఫిలిం స్టూడియో నిర్మాణం కోసం బాలకృష్ణ ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ వైకాపా గెలుపుతో ఆ పని కుదరలేదు. ఇప్పుడు బాలయ్య నుంచి ఆ ఛాయిస్ చిరంజీవి- నాగార్జున వైపు షిఫ్టయ్యింది. వీరికి విక్టరీ వెంకటేష్- డి.సురేష్ బాబు బృందం తందానా అంటున్నారు కాబట్టి ఇక వైజాగ్ టాలీవుడ్ షురూ అయినట్టేనని భావించాల్సి ఉంటుంది. విశాఖ నగరానికి చెందిన పలువురు నాయకులు తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధి కోసం తహతహలాడుతుండడంతో చిరంజీవి- నాగార్జునకు ఇది పెద్ద ప్లస్ కానుంది.
స్టూడియోల నిర్మాణానికి భూములిస్తే చిరంజీవి.. నాగార్జున స్టూడియోలు నిర్మించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోసారి పరిశ్రమ పెద్దలంతా వైజాగ్ టాలీవుడ్ విషయమై ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఆ భేటీతో పూర్తి క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇప్పటికైతే వైజాగ్ టాలీవుడ్ లో బాలయ్య భాగం అవుతారా లేదా? అన్నది సస్పెన్స్.