టబుతో ముసలి దర్శకుడి ప్రేమ బాగోతం ! 

ప్రేమకు వయస్సు అడ్డు కాదు అని వయసు అయిపోయాక ప్రేమలో పడే ముదురు ప్రేమికులు వాదిస్తూ ఉంటారు, కొందరు తమ ప్రేమ విరహంతో ఆ వయసులో కూడా లేచిపోయి అది నిరూపించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకునే మన పెద్దలు.. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరు మాత్రం చెప్పగలరు ? అనే ఒక పాత డైలాగ్ ను రాసి ఉంటారు. ప్రెజెంట్ మ్యాటర్ లోకి పోతే ఓ ముసలి బాలీవుడ్ దర్శకుడు మాజీ బ్యూటీ టబును తెగ ప్రేమిస్తున్నాడని.. ఆయనగారికి వయసు అయిపోయినా ప్రేమ మాత్రం రోజురోజుకు పెరుగుతుందని బాలీవుడ్ మీడియా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకు పెరగదు.. ఏ మాత్రం తరగని అందంతో ఇప్పటికి బోల్డ్ క్యారెక్టర్స్ తో కుర్రకారును ఉపేస్తోంది టబు.

ఈ మాజీ హీరోయిన్ ఇప్పటికీ గ్లామరస్ రోల్స్ చేస్తోంది. బహుశా ముసలి దర్శకుడికి అందుకే ప్రేమ పుట్టి ఉంటుంది. పాపం ముసలి దర్శకుడి భార్య ఆ మధ్య కాలం చేయడం.. ఇక ఆయన పిల్లలు కూడా యూఎస్ లో సెటిల్ అయిపోవడంతో.. ఇక ఈ ఓల్డ్ డైరెక్టర్ కి ఏమి చేయాలో తెలియక, చివరికీ టబు ప్రేమలో పడి కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. అయినా టబు కూడా ప్రేమ పిపాసినే కదా. ఇప్పటికే ఎన్నో ప్రేమ వ్యవహారాల్లో ఆరితేరి ముదిరిపోయిన హీరోయిన్ అయ్యే. పైగా ఏభై దాటుతున్నా ఇంకా పెళ్లి కూడా చేసుకోకుండా ప్రేమ పక్షిగానే మిగిలిపోయిన స్టార్ హీరోయిన్ అయ్యే. మరి ఎవరు మాత్రం ఎందుకు ప్రేమించరు. మరి టబు ఆ ఓల్డ్ డైరెక్టర్ బాధను అర్ధం చేసుకుని ఆయనకు తన ప్రేమను అందిస్తుందేమో చూడాలి.

ఎలాగూ ఆ మధ్య తనకు తల్లి కావాలని ఉందని కూడా టబు ఒక స్టేట్ మెంట్ పడేసింది. కానీ లేటు వయసులో తల్లి అయితే ఇక సినిమాలతో పాటు టూర్లను కూడా తగ్గించుకోవాలని భయంతో.. పైగా తన సమయం మొత్తాన్ని తల్లి తనానికే ఓపిగ్గా పెట్టాలని తనలో అంత ఓపిక లేదని, అందుకే తాను పెళ్లి జోలికి వెళ్లలేదని ఇలా ఏదేదో చెప్పుకొచ్చింది టబు. అయినా టబుకు గ్లామర్ మీద ఉన్న ఇంట్రస్ట్ , పెళ్లి మీద లేకుండా పోవడం, ఆ ముసలి దర్శకుడు బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇంతకీ ఆ బాలీవుడ్ దర్శకుడు గతంలో అజయ్ దేవగణ్ కు మూడు హిట్ సినిమాలను ఇచ్చాడు. అలాగే షారుక్, సంజయ్ దత్, సల్మాన్ తో కూడా కలిసి పని చేశాడు.