ఇన్సైడ్ టాక్ : “డీజే టిల్లు” సీక్వెల్ కి హీరోయిన్ గా మార్చేస్తున్నారా??

ఈ ఏడాది మన టాలీవుడ్ దగ్గర బాక్సాఫీస్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యిన చిత్రాల్లో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన హిట్ చిత్రం “డీజే టిల్లు” కూడా ఒకటి. దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా భారీ హిట్ అయ్యి భారీ లాభాలు అందించింది.

అయితే ఇక ఈ సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేసాక మంచి అంచనాలు నెలకొనగా దీని తర్వాత ఈ సినిమాకి మళ్ళీ మార్పులు చేర్పులు స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇప్పుడు సినిమాలో ఓ బిగ్ ఛేంజ్ ఉండనున్నట్టు తెలుస్తుంది. అది కూడా హీరోయిన్ విషయంలో అన్నట్టు ఇన్సైడ్ టాక్.

అయితే మొదటి సినిమాలో హీరోయిన్ గా నేహా శెట్టి కనిపించగా ఈ సినిమాలో అయితే యంగ్ హీరోయిన్ పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల కనిపిస్తుంది అని తాజా టాక్. అయితే ఇద్దరూ ఉంటారా లేక ఆమెని తనతో రీప్లేస్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది ఎలాగో ఫస్ట్ పార్ట్ లో రాధికా పాత్ర ముగిసినట్టే అనిపించింది.

మరి కొత్త సీక్వెల్ లో ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమాని కొత్త దర్శకుడు తెరకెక్కించనుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళే నిర్మాణం వహిస్తున్నారు…