ఇన్సైడ్ టాక్ : ఇలా అయితే “గాడ్ ఫాదర్” కోసం పవన్ వస్తాడా.?

ఈ దసరా కానుకగా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ లు నటించిన లేటెస్ట్ సినిమా “గాడ్ ఫాదర్”. ఐతే ఈ చిత్రంని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యిన సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ స్టార్ట్ అయ్యింది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో అయితే స్పెషల్ గెస్ట్ గా మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడని మొదట టాక్ వచ్చింది.

అయితే లాస్ట్ మినిట్ లో మళ్ళీ పవన్ ఆ రోజుకి హాజరు కాకపోవచ్చని తెలిసింది. కానీ ఇప్పుడు అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు ఈ 25కి ఫిక్స్ అయ్యినట్టుగా తెలియగా ఆ డేట్ కి అయితే పవన్ ఇక్కడ ఉండకపోవచ్చని తెలిసింది. కానీ ఇప్పుడు అయితే డీ డేట్ మారినట్టుగా సినీ వర్గాల్లో టాక్ తెలుస్తుంది.

అంటే ఈ డేట్ కి పవన్ అందుబాటులోకి వచ్చేస్తాడని దీనితో పవన్ అయితే ఈ ఈవెంట్ లో కనిపించే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. దీనిపై అయితే మెగా ఫ్యాన్స్ ఓ బిగ్ క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అయితే నయనతార, సునీల్, సత్యదేవ్ లు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.