ఇన్సైడ్ టాక్ : “గాడ్ ఫాదర్” విషయంలో మెగాస్టార్ సీరియస్ గా ఉన్నారా.?

ప్రెజెంట్ టాలీవుడ్ నుంచి రిలీజ్ సిద్ధంగా ఉన్న పెద్ద సినిమా ఏదైనా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాదర్” మాత్రమే అని చెప్పాలి. ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి కానీ బాక్సాఫీస్ దగ్గర మినిమమ్ 50 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టే సినిమాగా ఇదే ఉందని చెప్పాలి.

మెగాస్టార్ హీరోగా నటించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించారు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ మెగాస్టార్ అయితే ఈ సినిమా విషయంలో మాత్రం చాలా సీరియస్ ఆ ఉన్నారని తెలుస్తుంది. తాను లాస్ట్ చేసిన “ఆచార్య” తరహాలో ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా గాడ్ ఫాదర్ కి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే అగ్రెసివ్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడం విశేషం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆడియెన్స్ ని తన సినిమాకి ఎలా అయినా రప్పించాలని చూస్తున్నారట. అందుకే అప్పుడే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేసి తానే గతంలో ఎప్పుడు లేని రీతిలో ప్రమోషన్స్ కి పాల్గొంటున్నారు.

ఏకంగా గాడ్ ఫాదర్ గెటప్ లో కనిపిస్తూ ఉండడం అలాగే రేడియో మిర్చి వరకు వెళ్లి కూడా తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారంటే ఇక అర్ధం చేసుకోవచ్చు చిరు ఈ సినిమా ఫలితం విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో అనేది.