ఇండస్ట్రీ టాక్ : సామ్ “శాకుంతలం” కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారా.??

అక్కినేని వారి మాజీ కోడలు అలాగే మన తెలుగు సినిమా స్టార్ హీరోయిన్ సమంతా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సమంతా ఇప్పుడు సినిమాలు మాత్రమే కాకుండా పలు థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది.

అలా రీసెంట్ గా వచ్చినటువంటి తన పాన్ ఇండియా సినిమా “యశోద” టీజర్ అందరినీ థ్రిల్ చెయ్యగా ఆ సినిమాపై మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం తో పాటుగా సమంతా మరో భారీ పాన్ ఇండియా సినిమా కూడా చేస్తుంది.

ఆ సినిమానే “శాకుంతలం” కాగా దీనిని దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తుండగా ఇప్పుడు దీని రిలీజ్ డేట్ పై అయితే సినీ వర్గాల్లో కొత్త టాక్ బయటకి వచ్చింది.

మరి ఈ టాక్ ప్రకారం చిత్ర యూనిట్ ఈ సినిమాని ఈ ఏడాదిలోనే ప్లాన్ చేస్తున్నారట. దాదాపు అయితే డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. ఇక దీనిపై ఓ అఫీషియల్ అప్డేట్ కూడా రావచ్చని అంటున్నారు.

మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై ఎప్పుడు అప్డేట్ వస్తుందో చూడాలి. అయితే ఈ సినిమాని గుణశేఖర్ మరియు దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.