ఇండస్ట్రీ టాక్ : “పుష్ప 2” గ్రాండ్ రిలీజ్ పై బయటకొచ్చిన ఓ మాసివ్ అప్డేట్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా వచ్చిన బిగ్గెస్ట్ హిట్ సినిమా “పుష్ప పార్ట్ 1” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తో అల్లు అర్జున్ చేసిన హ్యాట్రిక్ సినిమా కావడంతో అనేక అంచనాలు నెలకొల్పుకొని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది.

అయ్యి అనుకున్న దానికి మించే భారీ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా కి సీక్వెల్ పుష్ప పార్ట్ 2(పుష్ప ది రూల్) సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనగా దీనికి ఆల్రెడీ రికార్డు స్థాయిలో బిజినెస్ కూడా ఈ సినిమా చేసుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వచ్చింది.

ఇక ఇదిలా ఉండగా గత కొన్నాళ్ల కితం పుష్ప పార్ట్ 1 గ్రాండ్ సక్సెస్ తో పుష్ప ది రూల్ ని నెక్స్ట్ లెవెల్లో తీస్తామని అంతే కాకుండా సాధ్యమైనన్ని ఎక్కువ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తానని బన్నీ ఒక పెద్ద ప్రామిస్ నే ఇచ్చాడు. మరి దీనిపై ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.

ఈసారి మేకర్స్ ఏకంగా 10 భాషల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. దీనితో పుష్ప 2 గ్రాండ్ రిలీజ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర నటిస్తుండగా దీని తర్వాత మరికొందరు బిగ్ స్టార్స్ ఈ సినిమాలో నటించనున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ డబుల్ బడ్జెట్ తో ఈ సినిమాని లావిష్ గా ప్లాన్ చేస్తున్నారట.