ఇండస్ట్రీ టాక్ : “పుష్ప” రెండో సినిమాకి సుకుమార్ ఇలా కూడా మారబోతున్నాడా?

పాన్ ఇండియా సినిమా దగ్గర కొత్త స్టార్ గా ఎదుగుతున్న మరో స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కొత్త హైట్స్ లోకి వెళ్తున్న అల్లు అర్జున్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు.

అయితే తాను హీరోగా నటించిన గత చిత్రం “పుష్ప” నేషనల్ వైడ్ కూడా భారీ రీచ్ ని సొంతం చేసుకోగా ఇక పుష్ప 2(పుష్ప ది రూల్) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఈ చిత్రానికి అయితే దర్శకుడు సుకుమార్ మరింత హార్డ్ వర్క్ చేస్తుండగా పుష్ప సినిమా ముహూర్తం కూడా నిన్ననే స్టార్ట్ అయ్యింది.

దీనితో భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం విషయంలో సుకుమార్ కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం విషయంలో అయితే సుకుమార్ దర్శకునిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారబోతున్నాడట. మరి ఇదెలా కన్ఫర్మ్ అయ్యింది అంటే..

నిన్నటి ముహూర్తం ఫోటోలలో పుష్ప పోస్టర్ పై గతంలో లేని విధంగా సుకుమార్ రైటింగ్స్ అని కూడా ఉండడంతో ఈ సినిమా సుకుమార్ ప్రొడక్షన్స్ లో కూడా తెరకెక్కుతుంది అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీనితో అయితే ఈ చిత్రంకి మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా కొత్త నిర్మాత కూడా దక్కినట్టే అని చెప్పాలి.