ఇండస్ట్రీ టాక్ : ఆ క్రేజీ సీన్ తో త్రివిక్రమ్ – మహేష్ లు మొదలు పెట్టేది అప్పుడేనట.!

టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హంక్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ మరోసారి త్రివిక్రమ్ తో చేస్తున్న భారీ సినిమా కోసం అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ మహేష్ కి ఇది హ్యాట్రిక్ సినిమా కాగా అలాగే హీరోయిన్ పూజా హెగ్డే తో కూడా త్రివిక్రమ్ కి ఇది హ్యాట్రిక్ సినిమానే కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఇక దీనితో పాటుగా ఈ సినిమా ని కూడా నెవర్ బిఫోర్ బడ్జెట్ తో భారీ ఏక్షన్ ఫిల్మ్ గా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలు కావాల్సి ఉండగా పలు కారణాల చేత కాస్త ఆగాల్సి వచ్చింది. దీనితో అయితే ఇపుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా మారింది.

అయితే ఈ షూటింగ్ కి గాను మహేష్ తో ఇంకా త్రివిక్రమ్ రిహార్సల్స్ చేయిస్తున్నాడట. దీనితో అయితే ఈ చిత్రం ఈ సోమవారం అంటే సెప్టెంబర్ 12 నుంచి మొదలు కానుంది అట. మరి ఈ ఫస్ట్ షూటింగ్ అయితే ఓ భారీ ఏక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేయనున్నారట.

అది కూడా సినిమాలో ఓ బిగ్గెస్ట్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో అయితే మరికొందరు స్టార్స్ కనిపించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు సుమారు 200 కోట్లు బడ్జెట్ ని పెడుతున్నారు.