ఆ విషయంలో ఇలియానాకు డీల్ కుధిరిందట!?

ileana big Offer with netflix and altbalaji web series !
గోవా బ్యూటీ’ ఇలియానా టాలీవుడ్ లో జోరు పెంచినా బాలీవుడ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అడపాదడపా విజయాలు అందుకున్నా ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.. డిమాండ్ మాత్రం పెరగలేదు. దీంతో ఓటీటీలపై దృష్టి పెట్టాలని ఇలియానా డిసైడ్ అయిందట.
 
‘నెట్ ఫ్లిక్స్’, ‘ఆల్ట్ బాలాజీ’ వంటి సంస్థలతో ఇలియానా డీల్ కుదుర్చుకుందట. ఓ వెబ్ సిరీస్‌లో నటించడంతోపాటు.. మరో వెబ్ సిరీస్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తోందట. దక్షిణాదిన కూడా ఇలియానాకు గుర్తింపు ఉండడం ఆమెకు ప్లస్ అయ్యింది. దాంతో ఓటీటీలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నట్టు సమాచారం. ఇలియానా నటిస్తానంటే..
 
భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కొన్ని నిర్మాణ సంస్థలు సిద్ధంగానే ఉన్నాయట. దీంతో ప్రస్తుతానికి సినిమాలను పక్కనపెట్టి వెబ్ సిరీస్‌లే చెయ్యాలని ఇలియానా నిర్ణయం తీసుకుందట.