డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు గాయని చిన్మయి… ఈ మధ్యకాలంలో మీటూ ఉద్యమం వల్ల రోజూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ సినీగేయ రచయిత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. అయితే ఆ తర్వాత పరిణామాలే ఆమెను బాధిస్తున్నాయని అన్నారు. తన పట్ల జరిగిన సంఘటనల గురించి బయట పెట్టినందుకు పని దొరక్కుండా పోయిందని బాధపడుతున్నారు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద.
అలాగే వైరముత్తు తనపట్ల ప్రవర్తించిన తీరును వెల్లడిస్తూ ఇటీవల చిన్మయి షాకింగ్ విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయాలను చెప్పినందుకు సోషల్ మీడియాలో తనపట్ల ద్వేషపూరిత, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చిన్మయి వెల్లడించారు.
When I wear a sari there are groups of men who take photographs of my waist + side of my chest, circle it and upload it on soft porn websites. And then I get messages on how they are masturbating to it.
I can be Indian in a sari and in jeans, Sir. https://t.co/94Ctcsa361
— Chinmayi Sripaada (@Chinmayi) January 28, 2019
‘ట్విటర్‌లో నాకు రోజూ వందలాది మెసేజ్‌లు వస్తున్నాయి. అవన్నీ నాపై మరొకరు చేస్తున్న కామెంట్లే. ఇప్పుడు సమస్య జాతి, రాజకీయాల వరకు వెళ్లింది. నా స్నేహితులు, సన్నిహితులు నా గురించి ఆందోళన చెందుతున్నారు. జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇస్తున్నారు. నేను అన్ని విషయాలు బయటపెడుతున్నానని నాకు పనిలేకుండా పోయింది.
అయినా పర్వాలేదు. ఇతర భాషలకు చెందిన పరిశ్రమల్లోనూ పనిచేస్తున్నాను. ఎక్కడో ఒకచోట పని దొరక్కుండాపోదు. కానీ నా బాధేంటంటే.. నాకు నచ్చిన పని నుంచి నన్ను దూరం చేశారు. నేను తీసుకున్న రిస్క్ ఏ ఆడపిల్లా తీసుకోవడానికి ధైర్యం చేయదు’ అని వెల్లడించారు చిన్మయి.
ఈ సంగతి పక్కన పెడితే తాజాగా.. ట్విట్టర్ ఓ నెటిజన్ చిన్మయిని అభినందిస్తూ చీర కట్టుకోమని సలహా ఇచ్చాడు. దీనిపై స్పందించిన చిన్మయి.. షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
”గతంలో ఇలానే కొందరి సలహాల మేరకు చీర కట్టుకుంటే కొంతమంది సైడ్ నుండి నా ఎద భాగం, నడుము కనిపించేలా ఫోటోలు తీసి వారిని సాఫ్ట్ పోర్న్ సైట్లోకి అప్లోడ్ చేశారు. మరికొంతమంది వాటిని చూస్తూ masturbating చేసుకున్న విషయాలను నాకు మెసేజ్ లుగా పంపించారు” అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది.