సోషల్‌మీడియాలో నా పై ట్రోల్స్‌ను పట్టించుకోను!

సోషల్‌మీడియాలో నా పై ట్రోల్స్‌ను పట్టించుకోను!

 
‘‘మీటూ’అనేది మూమెంట్‌. మహిళలపై వేధింపులనేవి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. యాక్టర్స్‌ పబ్లిక్‌ ఫిగర్స్‌ కాబట్టి ఈజీగా కామెంట్‌ చేయొచ్చని కొందరు అనుకుంటారు. సోషల్‌మీడియాలో నా పై ట్రోల్స్‌ను పట్టించుకోను’’ అన్నారు నివేదా థామస్‌.  స్క్రీన్‌ టైమ్‌ కాదు.. కథలో  పాత్రకు ప్రాముఖ్యత ఉండాలని కోరుకునే హీరోయిన్ నివేదా థామస్‌.  ఇటీవల ఓ  సందర్భంగా కలిసినప్పుడు  నివేదా థామస్‌ చెప్పిన కబుర్లు ఆమె మాటల్లోనే…. నేనేం చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయాలనుకుంటాను. సీన్‌కు అవసరం అయితేనే హోమ్‌వర్క్‌ చేస్తాను. రొటీన్‌ సినిమాలు చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు.
 
 బ్రోచేవారెవరురా’  సినిమాకు నేనే డబ్బింగ్‌ చెప్పాను. ‘జెంటిల్‌మన్‌’ అప్పుడే నా పాత్రకు నేను డబ్బింగ్‌ చెప్పాలనుకున్నాను. కుదర్లేదు. ‘118’ చిత్రం నుంచి నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నా. తమిళంలో సినిమాలు చేయకపోవడానికి పెద్దగా కారణం ఏమీ లేదు. ‘జెంటిల్‌మన్‌’ తర్వాత తెలుగులో నాకు చాలా మంచి స్క్రిప్ట్స్‌ వచ్చాయి. చేస్తున్నాను.  ప్రస్తుతం ఇంద్రగంటిగారి ‘వి’లో నటిస్తున్నా. ‘శ్వాస’ సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. రజనీకాంత్‌గారి ‘దర్బార్‌’ సినిమాలో నటిస్తున్నానా? లేదా? అనేది  నేను చెప్పలేను. చిత్రబృందం అధికారికంగా చెబితే బాగుంటుంది,  హైదరాబాద్‌లో ఇంకా ఇల్లు కొనలేదు. కొనే ఆలోచనలో ఉన్నాను అంటూ మనసులోని మాటలను చెప్పింది నివేదా థామస్‌.