కుర్ర హీరోలకు కలిసొస్తోందా?
ఓ వైపు డిస్ట్రిబ్యూషన్ రంగంలో వరుస సినిమాలతో బిజీగా వుంటూనే నిర్మాతగానూ బిజీగా గడిపేస్తున్నారు దిల్ రాజు. పంపిణీ రంగం నుంచి నిర్మాతగా ప్రమోటయ్యారు కాబట్టి ఆయన ప్రణాళికలు ఏ లెవల్లో ఉంటాయో అంచనా వేయగలం. ప్రస్తుతం మహేష్‌తో అనిల్ రావిపూడి రూపొందిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న దిల్ రాజు మరో వైపు హిట్టిచ్చే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్ని నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్ తో `ఇద్దరి లోకం ఒకటే` పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని ఓ పాపులర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మంచి ఆఫర్ ఇచ్చి సొంతం చేసుకుంది.
రాజా ది గ్రేట్.. ఈ ఆఫర్లేమిటో
ఈ మూవీతో పాటు ఇంకా ప్రారంభమే కానీ మరో క్రేజీ ప్రాజెక్ట్ హక్కుల్ని కూడా దక్కించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నాగచైతన్య హీరోగా దిల్‌రాజు నిర్మించనున్న మరో చిత్రానికి ఇదే తీరుగా ఎగరేసుకు వెళుతున్నారట. ఈ చిత్రంలో కన్నడ కస్టూరి రష్మిక మందన్న హీరోయిన్గా నటించనుంది. ఈ మూవీ ద్వారా యంగ్ టాలెంట్‌ని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. రొమాంటిక్ లవ్‌స్టోరీగా వచ్చే ఏడాది ప్రధమార్థంలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రానికి `అదే నువ్వు అదే నేను` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ రెండు చిత్రాల శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకున్న జెమినీ టీవీ త్వరలో దిల్ రాజు కాంపౌండ్ నుంచి రానున్న తదుపరి చిత్రాలపైనా కన్నేసినట్లు చెబుతున్నారు. అభిరుచి ఉన్న నిర్మాత నుంచి సినిమాలు కొనుక్కోవడం అన్న లాజిక్ ని ఫాలో చేస్తున్నారా?