రవితేజ క్రాక్ ” షూర్ షాట్ నో డౌట్ ” .. బ్యాడ్ రికార్డ్ బ్రేక్ ..!

రవితేజ లేటెస్ట్ సినిమా క్రాక్ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్ లో ఆతృత మొదలైంది. తన అభిమాన హీరో సినిమా భారీ స్థాయిలో థియేటర్స్ లోకి రాబోతోంది కాబట్టి హంగామా మామూలుగా లేదు. ఆ హంగామా ఎలా ఉందంటే క్రాక్ సినిమాలో రవితేజ చెప్పే డైలాగ్ “షూర్ షాట్ నో డౌట్” అన్నట్టుగా. గత కొంతకాలంగా రవితేజ కి వరస ఫ్లాప్స్ వచ్చి కాస్త డీలా పడ్డాడు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ అకౌంట్ లో చెప్పుకోవడానికి ఒక్క హిట్ కాదు కదా కనీసం యావరేజ్ సినిమా కూడా లేదు.

Krack: Ravi Teja unveils new poster with Shruti Haasan. See pic - Movies  News

 

అయినా రవితేజ దూకుడు మీదే ఉన్నాడు. అయితే ఇప్పుడు రాబోతున్న క్రాక్ మీదే రవితేజ కెరీర్ ప్లానింగ్ ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ సినిమా కూడా రిజల్ట్ తేడా కొడితే ఖచ్చితంగా ఆ ప్రభావం ఈసారి గట్టిగా పడుతుంది. అందుకే క్రాక్ సినిమాని ఎంతో కష్టపడి చేశాడు. దర్శకుడు గోపిచంద్ మలినేని కూడా క్రాక్ కోసం చాలా రిస్క్ తీసుకున్నాడు. ఒంగోలులో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని పక్కా కమర్షియల్ ప్యాక్డ్ మూవీగా క్రాక్ ని సిద్దం చేశాడు. ఇక రవితేజ కి బాగా కలిసొచ్చిన పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు.

ఇప్పటికే ప్రమోషన్స్ ని పీక్స్ లో నిర్వహించారు. ఈ క్రమంలో ఇటీవల రవితేజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా కాన్‌ఫిడెంట్ గా మాట్లాడాడు. ఆ కాన్‌ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా క్రాక్ సినిమా డైలాగ్ మాదిరిగా ఈ సారి రవితేజ కి ఉన్న బ్యాడ్ రికార్డ్ ని బ్రేక్ చేయడం పక్కా అని తెలుస్తోంది. ఈ సినిమాతో మళ్ళీ రవితేజ సక్సస్ ట్రాక్ ఎక్కి ఫాం లోకి రాబోతున్నాడని అందరూ అంటున్నారు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా థమన్ క్రాక్ సినిమాని మరో లెవెల్ కి తీసుకు వచ్చాడు. ఇక వసూళ్ళ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు.