ఇండస్ట్రీ టాక్ : పవన్ “జల్సా” రీ రిలీజ్ కి భారీ లెవెల్లో ప్లానింగ్స్ అట.!

సౌత్ ఇండియా సినిమా దగ్గర మన టాలీవుడ్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే డెఫినెట్ గా ఆ సంబరాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వీటికి మించి ఆ హీరోల బర్త్ డే లు వస్తే మాత్రం వేరే లెవెల్లో ఆ రోజుని అభిమానులు జరుపుకుంటారు.

మరి అలా ఈ ఏడాది మన తెలుగు సినిమా దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే రావడంతో ఈ వేడుకలను మహేష్ ఫ్యాన్స్ మహేష్ కెరీర్ లో భారీ హిట్ “పోకిరి” రీ మాస్టర్ ప్రింట్ తో రికార్డు వసూళ్లతో సెలబ్రేట్ చేసుకోగా ఇక ఇప్పుడు మరో బిగ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది.

దీనితో పవన్ నటించిన “జల్సా” సినిమా రీ రిలీజ్ పనులు మేకర్స్ స్టార్ట్ చెయ్యగా నిన్నటితో ఈ సినిమా ప్రింట్ వర్క్ లు మరియు అలాగే ఫైనల్ అవుట్ పుట్ చూడడం కూడా జరిగిపోయి మెగా కాంపౌండ్ నుంచి ఒక సరైన క్లారిటీ వచ్చేసింది.

ఇక దీనితో ఒక్కసారిగా భారీగా పెరిగిన అంచనాలు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ లెవెల్లో ప్లాన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లాస్ట్ టైం పోకిరీకి వరల్డ్ వైడ్ 375 స్పెషల్ షోస్ ప్లాన్ చెయ్యగా ఇప్పుడు జల్సా సినిమాకి ఏకంగా 500 కి పైగా షోస్ ని మెగా మరియు పవన్ ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ క్రేజీ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారింది. అయితే పవన్ ఫ్యాన్స్ ఎలాంటి వసూళ్లు నమోదు చేస్తారో చూడాలి.