తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ గా మొదలయ్యి ఇప్పుడు ఒక టాప్ నిర్మాతగా మారిన నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. మరి దిల్ రాజు ఇప్పుడు తన బ్యానర్ లో భారీ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి సెట్ చేస్తుండగా ఇప్పుడు రెండు స్పెషల్ ప్రాజెక్ట్ లు దిల్ రాజు నుంచి రాబోతున్నాయి.
మరి వాటిలో ఒకటి సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో మొదటిసారి తెలుగులో సినిమా అందులోని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కాగా మరొకటి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని కూడా తెలుగులోకి పరిచయం చేస్తున్న సినిమా “వారసుడు”.
అలాగే ఇంకో స్పెషల్ అంశం ఏమిటంటే ఈ చిత్రాల్లో దిల్ రాజు నిర్మించిన 50వ సినిమాగా కూడా శంకర్ తో సినిమా వస్తుంది. మరి ఇప్పుడు ఈ రెండు సినిమాలకి కలిపి ఓవర్సీస్ లో భారీ ఆఫర్స్ వస్తున్నాయట. లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అయితే 60 నుంచి 70 కోట్ల మేర ఆఫర్స్ ఈ సినిమాలకి వస్తున్నట్టు తెలుస్తుంది.
దీంతో రెండిటికి కలిపి కూడా మేకర్స్ డీల్ ని పూర్తి చేసేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే దిల్ రాజు పెడుతున్న డబ్బులు మళ్ళీ వెనక్కి వచ్చేయడం స్టార్ట్ అయ్యిందని చెప్పాలి.