ఇన్‌స్టా ఫైర్‌: వేడెక్కించే సోకులు‌ ఎండ‌మావులేనా?

హీరో ఫామ్‌హౌస్‌లో బ్యాడ్‌గాళ్ వారంపాటు లాక్డ్

లాక్ డౌన్ వ‌ల్ల సెల‌బ్రిటీలంతా ఇండ్ల‌కే అంకిత‌మ‌య్యారు. క్వారంటైన్ టైమ్ ని ర‌క‌ర‌కాలుగా ఆస్వాధిస్తున్నారు. కొంద‌రు సెల‌బ్రిటీలు కిచెన్ ప‌నులు క్లీనింగ్ ప‌నులు చేస్తుంటే.. యువ‌క‌థానాయిక‌లు మాత్రం నిరంత‌రం ఫోటోషూట్ల‌తో బిజీగా ఉన్నారు.

రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో ఇన్ స్టాలో అభిమానుల‌కు ట్రీటిస్తున్నారు. ఈ త‌ర‌హా భామ‌ల్లో దిశా ప‌టానీ- అదాశ‌ర్మ‌- ఊర్వ‌శి రౌతేలా స‌హా ప‌లువురు నాయిక‌లు జ‌రంత స్పీడ్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే.

అదాశ‌ర్మ ఇప్ప‌టికే అదాకి అదా ట్విట్ట‌ర్ స‌హా ఇన్ స్టాలోనూ ర‌క‌ర‌కాల ఫోటోషూట్లు.. వీడియోల్ని షేర్ చేస్తూ వేడి పెంచుతోంది.

చిరుత ఫేం నేహా శ‌ర్మ గ‌త కొంత‌కాలంగా ఫోటోషూట్ల విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ బాలీవుడ్ లో ప‌లు క్రేజీ ఫ్రాంఛైజీల్లో న‌టిస్తోంది.

అలాగే ఊర్వ‌శి రౌతేలా బికినీ ఫోటోషూట్లు ఇటీవ‌ల వైర‌ల్ అయ్యాయి. హేట్ స్టోరి 4 – గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ త‌ర్వాత ఆ త‌ర‌హా గ్లామ‌ర‌స్ రోల్స్ పోషించేందుకు ఈ భామ సౌత్ వైపు చూస్తోంది.

2.0 త‌ర్వాత ఎమీజాక్స‌న్ తిరిగి న‌టించ‌లేదు. త‌న బోయ్ ఫ్రెండ్ జార్జి ప‌నాయ‌టౌని పెళ్లాడి ఇటీవ‌ల ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా స‌రికొత్త ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. ఈ త‌ర‌హాలో నిరంత‌రం సోష‌ల్ మీడియాని హీటెక్కిస్తున్న భామ‌లెంద‌రో. అయితే ఎవ‌రు ఎన్ని ఫోటోషూట్లు చేసినా అవ‌న్నీ ఎండ‌మావులే. ప్ర‌స్తుతం ఈ భామ‌ల సినిమాలేవీ రిలీజ్ ల‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. మ‌రో ఏడాది పాటు థియేట‌ర్ల‌కు గ‌డ్డు కాలం త‌ప్పేట్టు లేదు. ఆ క్ర‌మంలోనే వీళ్లంతా ఓటీటీల్ని న‌మ్ముకోవాల్సి ఉంటుందేమో.