వీడియో: ప‌బ్లిక్‌లో పెగ్గేసి ద‌మ్ము కొట్టిన‌ నాటీ హీరోయిన్

అమ్మ‌డు ప‌బ్లిగ్గా సిగ‌రెట్ వెలిగించింది. పొగ‌ను రింగు రింగులుగా వ‌దులుతూ చాలా వేషాలే వేసింది. క‌ళ్లు తిరుగుతున్న‌ట్టు.. తెగ ఫోజిచ్చింది. పైగా పెగ్గేసి మ‌త్తులో జోగుతోంది. ఇంత‌కీ ఎవ‌రీ అమ్మ‌డు? అంటే .. బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వ‌శి రౌతేలా గురించే ఇదంతా. హేట్ స్టోరి 4లో అందాల ఆర‌బోత‌తో చెల‌రేగిన ఈ అమ్మ‌డు యువ‌త‌రంలో చ‌క్క‌ని ఫాలోయింగ్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది.

ఇక ఈ అమ్మ‌డు నిరంత‌రం సోష‌ల్ మీడియాలో ఇచ్చే ట్రీట్ గురించి తెలిసిందే. రెగ్యుల‌ర్ గా మ్యాగ‌జైన్ క‌వర్ ఫోటోషూట్లు.. హీటెక్కించే క‌స‌ర‌త్తుల వీడియోలతో వెర్రెత్తిస్తూనే ఉంటుంది. ల‌క్ష‌లాది మంది వీటిని ఇన్ స్టా మాధ్య‌మంలో వీక్షిస్తూనే ఉన్నారు.

తాజాగా ఊర్వ‌శి లేటెస్ట్ వీడియో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో ఊర్వ‌శి ద‌మ్ము కొడుతూ క‌నిపించింది. అది కూడా చుట్టూ జ‌నం ఉండ‌గా అంద‌రిలోనూ ఎలాంటి బెరుకు లేకుండా సిగ‌రెట్ తాగుతోంది. అలా పొగ‌ను గ‌ట్టిగా లోనికి లాగి రింగులుగా వ‌దులుతూ మ‌త్తుగా జోగుతూ క‌నిపించింది. ఓవైపు వైన్ గ్లాస్ ఖాళీ చేస్తోంది. మ‌రోవైపు ద‌మ్ము కొట్టేస్తోంది. అయితే ఇదంతా త‌న‌కు అల‌వాటు ఉండి చేసిందా? అంటే అదేం కాదు. ఏదో యాడ్ షూట్ లో పాల్గొంది అమ్మ‌డు. అయితే ఇది త్రోబ్యాక్ వీడియోనా? అన్న‌ది ఊర్వ‌శినే చెప్పాల్సి ఉంటుంది.

కెరీర్ వ్య‌వ‌హారం చూస్తే… ఊర్వ‌శి న‌టించిన పాగ‌ల్ పంతి 2019లో రిలీజై విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం `వ‌ర్జిన్ భానుప్రియ` అనే చిత్రంలో న‌టిస్తోంది. అజ‌య్ లోహాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ శ్రేయాన్స్ మ‌హేంద్ర ద‌రివాలా నిర్మిస్తున్నారు. కామెడీ డ్రామా చిత్ర‌మిది. జూన్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. త‌దుప‌రి తెలుగులో గోపీచంద్ స‌ర‌స‌న సిటీమార్ చిత్రంలో న‌టించ‌నుంది.