నిప్పు లేకుండా పొగ రాదు. అంతో ఇంతో చాటు మాటు వ్యవహారం సాగితేనే దానిని గాసిప్పులుగా ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సీక్రెట్ ఎఫైర్ గుట్టు లీకవ్వడం ఇటు తెలుగు చిత్ర సీమ సహా అటు బాలీవుడ్ లోనూ అంతే హాట్ టాపిక్ గా మారింది. అసలింతకీ ఏమిటా హాట్ ఎఫైర్ కహానీ అంటే కాస్త వివరంలోకి వెళ్లాల్సిందే.
ఇన్నాళ్లు టాలీవుడ్ సర్కిల్స్ లో పాపులర్ స్టార్స్ సరసన నటించి వరుసగా హిట్లు కొట్టేస్తున్న సదరు బ్యూటీ మొన్న సంక్రాంతి బరిలోనూ బ్లాక్ బస్టర్ తో వేడెక్కించేసింది. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన వరుసగా సినిమాలకు కమిటై కర్ఛీఫ్ లు వేసేసింది. అయితే ఈ అమ్మడికి ఇలా ఇక్కడ అంత పెద్ద ఆఫర్లు రావడానికి కారణం క్లీన్ ఇమేజ్ ని కలిగి ఉండడమే. ఇన్నాళ్లు అసలు ఫలానా యువహీరోతో ఎఫైర్ సాగిస్తోంది! అన్న రూమర్ అయితే లేనే లేదు. అయితే ఉన్నట్టుండి.. తాజాగా ఈ అమ్మడి సీక్రెట్ ఎఫైర్ వ్యవహారం లీకైపోయింది. సదరు బ్యూటీ బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో వారసుడిని డీప్ గా లవ్ చేస్తోందట. అంతేకాదు.. అతడితో ఔట్ స్కర్ట్స్ లో హోటల్స్ లో విందు వినోదాల్లో మునిగి తేలుతోంది. అయితే అదేదీ బయటికి తెలియనివ్వకుండా సీక్రెట్ గానే మెయింటెయిన్ చేస్తోంది. దీంతో ఇన్నాళ్లు ఇక్కడ అర్థం కాని గందరగోళంలో ఉండిపోయారంతా. తాజాగా సదరు భామ ప్రియుడితో కలిసి కార్ లో వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. గుట్టుగా ఎటో వెళ్లిపోతోంది ఈ ప్రేమజంట. కానీ ఈలోగానే మీడియా కంటికి చిక్కింది. ఇంకేం ఉంది .. అసలు గుట్టు కాస్తా అలా లీకైపోయింది. ఇక ఎలానూ ఎఫైర్ సంగతి తెలిసిపోయింది కాబట్టి ఇకపై టాలీవుడ్ లో అవకాశాల పరంగా అది ఎసరు పెట్టేయడం ఖాయమే! అంటూ అప్పుడే గుసగుసలు మొదలైపోయాయి. అంతేనా.. ఇన్నాళ్లు సాగించిన దూకుడు ఇకపై టాలీవుడ్ లో కుదరకపోవచ్చేమో! అన్న కొత్త కోణంపైనా యూత్ చెవులు కొరుక్కుంటోంది మరి. ఇంతకీ ఈ స్టోరీలో కథానాయిక ఎవరో చెప్పుకోండి చూద్దాం.