సినీ నటి శ్రీరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నివారణకు కమిటీ వేయాలంటూ పిటిషన్ లో ఆమె ప్రతిపాదించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం తెలంగాణ డీజీపీ, మహిళా కమిషన్, మహిళాభివృధి, సినిమాటోగ్రఫీ, కార్మిక శాఖకు నోటీసులు జరీ చేసింది.
ప్రభుత్వంపై లైంగిక దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అయినా ఇటువంటి ఘటనలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఏం చేస్తుందంటూ ప్రశ్నించింది. న్యాయ సేవాధికార సంస్థ సేవలు వినియోగించుకోవాలంటూ కోర్టు సూచించింది.
ఇదిలా ఉండగా శ్రీరెడ్డి మళ్ళీ దూకుడు పెంచింది. ఆమధ్య చెన్నై వెళ్ళినప్పుడు కొన్నిరోజులు తెలుగు ఇండస్ట్రీని పక్కన పెట్టింది. మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పటి నుండి పోస్టుల జోరు పెంచింది. పవన్ కళ్యాణ్, మురళి మోహన్, మెగా ఫ్యామిలీపై తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వీడియో పెట్టింది.
ఈ సందర్భంగా బీజేపీ అండతో పవన్ కళ్యాణ్ ఉద్యమాన్ని తొక్కేసాడు అంది. కేంద్రం నుండి ఒత్తిడి తెచ్చి మీడియా నోరు నొక్కేశారంటూ మండిపడింది. ఎవరు తొక్కాలని చూసినా శ్రీరెడ్డి వెనక్కి తగ్గదు అంటూ ఉద్యమం కొనసాగుతుంది అంటూ పేర్కొంది. రాజకీయ నాయకుల లిస్టు కూడా ఉందంటూ అది బయటకి వస్తుందనే భయంతోనే ఉద్యమానికి ఆటంకం కల్పించారని వెల్లడించింది.
ఎవరు ఆపాలని చూసినా ఉద్యమం ఆగదు అని స్పష్టం చేసింది. టైం వచ్చినప్పుడు అందరి పేర్లు బయట పెడతాను ఆధారాలతో సహా అని బాంబు పేల్చింది. నేను ఎవరికీ భయపడి లీక్స్ ఆపేయలేదు. శ్రీరెడ్డి ఎవరికీ భయపడదు. సరైన టైం కోసం ఎదురు చూస్తున్నా అని తెలిపింది శ్రీరెడ్డి.