హీరో విశాల్- ఆయన నిర్మాణ సంస్థ అయిన విశాల్ ఫిల్మ్ ప్యాక్టరీ అకౌంటెంట్ రమ్యకు మధ్య డబ్బుకు సంధించిన ఓ వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు 45 లక్షలు కాజేసినట్లు విశాల్ ఆమెపై ఆరోపించాడు. కొన్నేళ్లగా రమ్య ఇలా చేస్తున్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదని…కానీ చివరికి కంపెనీ లో పెద్ద మొత్తంలో టోకరా వేయాలని చూడటంతోనే సీన్ లోకి తాను రావాల్సి వచ్చిందని విశాల్ ఆరోపించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రమ్య తనపై విశాల్, అతని మేనేజర్ కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని ఖండించింది.
ప్రభుత్వానికి సరిగ్గా ట్యాక్స్ లు కట్టకుండా, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనని ఇరికిస్తున్నారని తెలిపింది. ఈ వివాదం కొద్ది రోజులుగా కోలీవుడ్ సహా టాలీవుడ్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ మరో సంచలన ప్రకటన రిలీజ్ చేసింది. రమ్య తమ కంపెనీలో పనిచేస్తుందని, కొన్నేళ్లగా కంపెనీ నిధులను అక్రమంగా మళ్లించిందని..ఈ క్రమంలో 45 లక్షలు మళ్లింపులో దొరికిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసామని తెలిపారు. రమ్యపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి రమ్యతో ఎవరైనా, ఏదైనా ఆర్థిక కార్యకలాపాలు జరిపి ఉంటే దానికి మీరే బాధ్యులు. రమ్యకు-కంపెనీకి ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. రమ్యతో ఎవరు ఆర్దిక వ్యవహారాలు నెరిపినా తమకు ఎలాంటి సంబంధం లేదని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం రమ్యపై ఎఫ్ ఆర్ నమోదవ్వడంతో ఆమెను పోలీసులు విచారించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. కోట్ల రూపాయలు ఖర్చు తో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ కొన్నేళ్లగా సినిమాలు నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో రమ్య అక్రమంగా నిధులు మళ్లీంచే క్రమంలో దొరికిపోవడంతో ఆ నెపాన్ని కంపెనీపైకే నెట్టే ప్రయత్నం చేస్తుందని కంపెనీలో పనిచేస్తోన్న సిబ్బంది సైతం ఆరోపించారు. గతంలో కూడా రమ్య వ్యవహారంపై సిబ్బంది అనుమానం వ్యక్తం చేసారు. విశాల్ సిబ్బందిని తన సొంత ఫ్యామిలీలా చూసుకుంటారని తెలిపారు. రమ్య వెనుకు విశాల్ శత్రువుల హస్తం ఉన్నట్లు సందేహం వ్యక్తం చేసారు.